Read more!

English | Telugu

ఎక్కువ చేయకు రష్మీ...వెంటనే మార్చడానికి బాయ్ ఫ్రెండ్ కాదు బల్బు!

 


ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో కొన్ని ఎపిసోడ్స్ నుంచి జడ్జ్ గా ఖుష్భు కనిపించడం లేదు. కానీ ఈ వారం ఎపిసోడ్ లో ఖుష్బూ కనిపించింది. ఇక స్కిట్స్ విషయానికి వస్తే ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. ఇమ్ము- వర్ష స్కిట్ కొంచెం నవ్వు తెప్పించేదిగా ఉంది. ఐతే వర్షాను తెగ అవమానించాడు ఇమ్ము. "రాత్రి ఎక్కడికెళ్ళావ్ లేచి చూస్తే పక్కలో లేవు" అని ఇమ్ము అడిగేసరికి "వాష్ రూమ్ కి వెళ్ళా" అని చెప్పింది "నువ్వు అబద్దాలు చెప్తావని నీ చేతికి స్మార్ట్ వాచ్ పెట్టాను. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేశావో చెప్తుంది..వాష్ రూమ్ కి వెళ్లి రావడానికి 10 అడుగులే కదా మిగతా అడుగుల పరిస్థితి ఏమిటి ఎక్కడికి వెళ్ళావ్" అని అడిగాడు. "వాష్ రూమ్ కి వెళ్లే గ్యాప్ లో నేనేం చేస్తాను" అని వర్ష పాపం ఏదో చెప్పబోయింది.

"నీకు చిన్న గ్యాప్ చాలు ప్రపంచ యాత్రికుడి కంటే ఎక్కువగా తిరిగేసి వస్తావ్" అన్నాడు. " ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడొచ్చా" అని మధ్యలో రష్మీ ఇమ్ముని అడిగేసరికి "ఎక్కువ చేశావంటే నీ స్మార్ట్ వాచ్ లోని అడుగులు కూడా లెక్కబెట్టేస్తా" అంటూ రష్మీ పరువు తీసేసాడు. "ఈరోజు ఏంటి వర్షా ఇంత అందంగా ఉన్నావు ..నిన్ను హీరోయిన్ గా పెట్టి నేను డైరెక్టర్ గా ఒక మూవీ తీస్తా" అన్నాడు "వద్దండి .. నాకు డైరెక్టర్స్ అంటే భయం. ప్రేమ పోయి భయం వచ్చేసిందా అప్పుడే" అని కౌంటర్ ఇచ్చాడు ఇమ్ము. ఇక ఫైనల్ గా పటాస్ ఫైమా-బులెట్ భాస్కర్ స్కిట్ కూడా ఫుల్ కామెడీగా ఉంది " పెసిరెంటు గారు వీధిలో బల్బు వెలగట్లేదు మార్చండి" అని అడిగింది ఫైమా. "వెంటనే మార్చేయడానికి అదేమీ బాయ్ ఫ్రెండ్ కాదు బల్బు" అని బులెట్ భాస్కర్ ఒక అద్దిరిపోయే డైలాగ్ వేసాడు..దానికి అందరూ నవ్వేశారు. ఇలా ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంటర్టైన్ చేయబోతోంది.