
చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్.!
టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాండింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ రకంగా బ్రదర్స్ లా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే చూడాలనేది.. అభిమానులు దశాబ్దాల కల. ఇప్పుడు ఆ కలను నిజం చేసే బాధ్యతను డైరెక్టర్ అనిల్ రావిపూడి తన భుజాలపై వేసుకున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. నలుగురు సీనియర్ స్టార్స్ లో నాగార్జునతో తప్ప మిగతా ముగ్గురు స్టార్స్ తో రావిపూడి సినిమాలు చేశారు. చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు', బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' చేశారు. ఇక వెంకటేష్ అయితే 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' చేశారు. అలాగే 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు రావిపూడి. అయితే నాగార్జునతో సినిమా చేస్తే.. నలుగురు స్టార్స్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించే అవకాశం అనిల్ రావిపూడికి ఉంటుంది. రావిపూడి సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. నాగ్ తో సినిమా చేయాలని ఉందనే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జునతో సినిమా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. సోలోగా కాకుండా, చిరంజీవితో మల్టీస్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. Anil Ravipudi, Chiranjeevi, Nagarjuna, Multistarrer
Jul 31, 2026 6:08PM
హీరోయిన్గా బాలయ్య కూతురు తేజస్విని ఎంట్రీ?
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తేజస్విని త్వరలోనే ఒక పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారట. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి భిన్నంగా, ఒక మంచి సామాజిక సందేశం ఉన్న లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. క్రియేటివ్ ఫీల్డ్ లో తేజస్విని కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓటీటీ వేదిక 'ఆహా'లో అఖండ విజయం సాధించిన బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షో వెనుక క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. అలాగే బాలయ్య సినిమాల ప్రొడక్షన్, స్క్రిప్ట్ లు, కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల తేజస్విని వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అలాగే ఒక కమర్షియల్ యాడ్ లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. నటిగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో.. ఆడియన్స్ కి చేరువ అవ్వడంలో భాగంగానే తేజస్విని ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి ఫ్యామిలీ నుంచి వెండితెరపై అడుగుపెడుతున్న తొలి నటిగా తేజస్విని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తారు. Balakrishna Daughter, Tejaswini Nandamuri, Acting Debut
Jul 31, 2026 4:15PM
ఎన్టీఆర్ కొత్త బిజినెస్.. గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్.!
టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్‌తో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్‌తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి ART సినిమాస్ తెచ్చారు. ఇప్పుడు ఈ బిజినెస్ రేస్‌లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి ప్రాంతంలో తారక్ ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. గచ్చిబౌలి అంటేనే ఐటీ ఎంప్లాయిస్, యూత్, నైట్ లైఫ్‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రైమ్ లోకేషన్. అలాంటి చోట తారక్ మల్టీప్లెక్స్ వస్తే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులు కేవలం సినిమా చూడటమే కాకుండా, ఒక లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ గ్లోబల్ స్టాండర్డ్స్‌తో థియేటర్లను నిర్మించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తారక్ కూడా ఇదే బాటలో నడుస్తూ, ఐటీ కారిడార్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచేలా ఒక గ్రాండ్ మల్టీప్లెక్స్‌ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. భారీ స్క్రీన్స్, అడ్వాన్స్డ్ డోల్బీ అట్మాస్ సౌండింగ్, వరల్డ్ క్లాస్ సీటింగ్ అండ్ ఫుడ్ కోర్ట్స్‌తో ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోందట. ఒక బడా సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్లో రూపుదిద్దుకునే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే గచ్చిబౌలిలో ఎన్టీఆర్ బ్రాండ్ నేమ్‌తో ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ హబ్ సిద్ధం కావడం ఖాయం. Jr NTR, Multiplex, Gachibowli, Hyderabad
Jul 31, 2026 3:43PM
జయకృష్ణ ఘట్టమనేని సెకండ్ మూవీ ఫిక్స్.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో బిగ్ ప్రాజెక్ట్.!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నిన్న(జూలై 30) థియేటర్లలో అడుగుపెట్టింది. సినిమా టాక్ పరవాలేదు అనేలా ఉన్నా.. హీరోగా జయకృష్ణకు మంచి మార్కులే పడ్డాయి. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని.. సరైన స్క్రిప్ట్స్ పడితే హీరోగా నిలదొక్కుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే జయకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ ఘట్టమనేని వారసుడి రెండో సినిమా లాక్ అయినట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని అయిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించనున్నారని టాక్. 'సామజవరగమన', 'నారీ నారీ నడుమ మురారి' సినిమాల దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన శ్రీవిష్ణుతో ఒక సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు. Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Anil Sunkara
Jul 31, 2026 3:09PM
వెంకీ అట్లూరి బిగ్ స్కెచ్.. ఆ స్టార్ హీరోతో పోలీస్ స్టోరీ.!
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'సార్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన ధనుష్, ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్‌గా నటించకపోవడం విశేషం. అందుకే ఈసారి ఆయన ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో కూడిన కథను సిద్ధం చేశారని టాక్. ఎమోషనల్ డ్రైవ్‌తో పాటు పక్కా కమర్షియల్ హంగులను మేళవించి ధనుష్‌ను సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది. 'సార్' సినిమా తర్వాత మళ్లీ ఒక బలమైన లైన్‌తో వెంకీ అట్లూరి సంప్రదించగానే ధనుష్ కూడా వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో అప్డేట్పై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. ఒక వైవిధ్యమైన నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను తనదైన శైలిలో ఎలా పోషిస్తారో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్య, మమితా బైజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Dhanush, Venky Atluri, Vishwanath and Sons
Jul 30, 2026 1:14PM
ఊహించని ట్విస్ట్.. రెండు భాగాలుగా రాబోతున్న అల్లు అర్జున్ 'రాకా'.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ బిగ్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాని ఒకే పార్ట్‌గా కాకుండా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే, మార్కెట్లో దీనికి ఉన్న హ్యూజ్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కోట్ చేసిన డిజిటల్ రైట్స్ నంబర్స్, ఓటిటి ప్లాట్ఫార్మ్స్ ఆఫర్ చేస్తున్న ఆఫర్లకు అంతగా మ్యాచ్ అవ్వలేదు. బడ్జెట్ రికవరీతో పాటు, బిజినెస్ పరంగా ప్రాజెక్ట్ రేంజ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే కథని విస్తరించి రెండు భాగాలుగా తేవడమే పర్ఫెక్ట్ రూట్ అని టీమ్ ఫిక్స్ అయ్యిందట. అట్లీ ఈ రెండు భాగాల ప్లాన్ గురించి అల్లు అర్జున్, అలాగే సన్ పిక్చర్స్ టీమ్‌తో డీటైల్డ్‌గా డిస్కస్ చేశారట. కథలోని డెప్త్, విజువల్ గ్రాండియర్ చూసిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా ఈ రెండు భాగాల ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సాధారణంగా రెండు భాగాల సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్స్ సాగుతూనే ఉంటాయి. కానీ 'రాకా' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మేకర్స్ వేసిన పక్కా స్కెచ్ ఏంటంటే... ఈ ఏడాది చివరి కల్లా 'రాకా' పార్ట్-1, పార్ట్-2 రెండింటి షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతే గ్రాండ్‌గా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడతారు. ఈలోగా డైరెక్టర్ అట్లీ 'రాకా' రెండు భాగాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద పూర్తిగా ఫోకస్ పెడతారు. Allu Arjun, Atlee, Raaka Movie, Two Parts
Jul 29, 2026 3:52PM
దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో టాలీవుడ్ హీరో.!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ, ఫిట్నెస్, యాక్షన్ సన్నివేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నారు. 2012లో వచ్చిన 'శివ మనసులో శృతి' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు, తన 14 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించారు. 'ప్రేమకథా చిత్రమ్', 'సమ్మోహనం' వంటి క్లాసిక్ హిట్స్‌తో పాటు 'నన్ను దోచుకుందువటే', 'శ్రీదేవి సోడా సెంటర్', 'మా నాన్న సూపర్‌హీరో' లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే గతేడాది భారీ అంచనాలతో తెరకెక్కిన పాన్ ఇండియా పౌరాణిక మిస్టరీ చిత్రం 'జటాధర' బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుధీర్ బాబు, ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ యువ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా కథారచన, దర్శకత్వ బాధ్యతలను కూడా తమ భుజస్కంధాలపై వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'RAPO 23'తో డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్నట్లు ప్రకటించగా, మరోవైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ'లతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా స్వీయ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే క్రమంలో సుధీర్ బాబు కూడా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సుధీర్ బాబు గత కొన్ని నెలలుగా ఒక విభిన్నమైన, పవర్ఫుల్ స్క్రిప్ట్‌పై తీవ్రంగా కసరత్తు చేశారు. ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో తన స్వంత కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించబోతున్నారు. స్వయంగా కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, డైరెక్షన్ కూడా చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కృష్ణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సుపర్ స్టార్ మహేష్ బాబు అండదండలు ఉన్నప్పటికీ.. సుధీర్ బాబు ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ పడక చాలారోజులు అవుతుండటంతో, ఈసారి ఎలాగైనా గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. Sudheer Babu, Directorial Debut, Actor Director, Tollywood
Jul 27, 2026 10:22AM
సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!
ఒక సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సింది కథ.. ఆ కథ తర్వాతనే హీరో, హీరోయిన్, దర్శకుడుతో పాటు ఇతర టెక్నీషియన్స్. ఆ అందరి పని తనం సినిమా విజయంలో కీ రోల్ పోషిస్తుంది. కానీ సినిమాకి అసలైన లివర్ మాత్రం 'కథ' మాత్రమే. కథ సరిగ్గా లేకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టినా, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది – "కథే నాయకుడు, కథే కథానాయకుడు" అని! ఈ నేపథ్యంలో కథ యొక్క గొప్పతనానికి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుల దగ్గర రచయితగా చేసిన రైటర్ ఒకాయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేసాడు. ఆ కథని టాప్ ప్రొడ్యూసర్ ల దగ్గరనుంచి, చిన్న ప్రొడ్యూసర్ ల వరకు అందరికి వినిపించాడు. అందరూ వినగానే మైమరచిపోయి లక్ష దగ్గర నుంచి ఐదు లక్షల దాకా అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కథ మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కలేదు. దాంతో ఆ రైటర్ తెరకెక్కని ఆ కథ వల్ల ముప్పై లక్షల వరకు సంపాదించాడు. సినీ రూల్స్ ప్రకారం అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ లో తెరకెక్కించకపోతే అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వరు. Also read: Chiranjeevi: సెంటిమెంట్ నిజమైందా! అభిమానుల కన్నీళ్లు ఆ రైటర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తెలుగు వాడి సత్తా చాటుతున్న టాప్ దర్శకుడి తొలి సినిమాకి కథని అందించాడు. ఆ చిత్రంలోని హీరో కూడా పాన్ ఇండియా కట్ అవుట్ . ప్రస్తుతం ఆ రైటర్ తన భార్య పేరుతో సీరియల్స్ కి పని చేసుకుంటున్నాడు. cinema, story, director, hero
Jul 24, 2026 5:14PMఅజయ్ భూపతి షాకింగ్ అప్డేట్.. కొరటాల శివ నిర్మాణంలో 'మంగళవారం 2'?
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన, 'కిల్లింగ్ వీరప్పన్', 'వంగవీటి', 'అటాక్' వంటి విభిన్న చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా తెరకెక్కించిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో వచ్చిన 'మహాసముద్రం' అనుకున్న స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ, 2023లో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన మిస్టీరియస్ థ్రిల్లర్ 'మంగళవారం' చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ కల్ట్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా 'మంగళవారం 2' రాబోతోందంటూ అజయ్ భూపతి ఇచ్చిన తాజా ప్రకటన టాలీవుడ్ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి దివంగత ప్రముఖ నటుడు రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడైన జయకృష్ణ ఘట్టమనేనిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాకి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. జూలై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల వేదికగానే అజయ్ భూపతి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మంగళవారం 2' గురించి సంచలన నిజాలను వెల్లడించారు. 'మంగళవారం 2' ఖచ్చితంగా తెరకెక్కుతుందని, ఈసారి ప్రేక్షకులు అస్సలు ఊహించని రీతిలో నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లాకింగ్ థ్రిల్స్ ఉండబోతున్నాయని అజయ్ భూపతి స్పష్టం చేశారు. మొదటి భాగంలో కేవలం గ్రామీణ మిస్టరీ, మానసిక అంశాలు ప్రధానంగా సాగితే, ఈ సీక్వెల్లో మాత్రం పూర్తిస్థాయి సూపర్ నేచురల్ క్యారెక్టర్స్ ప్రేక్షకాభిమానులను భయపెట్టి థ్రిల్ చేయబోతున్నాయని చెప్పారు. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను సీటు అంచున కూర్చోబెట్టేలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను 'శ్రీనివాస మంగాపురం' సినిమా విడుదలతో బిజీగా ఉన్నానని, ఆ మూడ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి 'మంగళవారం 2' ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కాస్త సమయం పడుతుందని ఆయన వివరంగా తెలియజేశారు. ఇక ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న ఆసక్తికరమైన సమాచారం ప్రకారం, అజయ్ భూపతి ఈ సీక్వెల్ కథాంశాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు వినిపించారట. కథలోని లైన్, గూస్బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎంతగానో నచ్చడంతో కొరటాల శివ తన స్వంత నిర్మాణ సంస్థ 'యువసుధా ఆర్ట్స్' బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 1990ల కాలం నాటి మారుమూల గ్రామీణ నేపథ్యంలో సాగే వింత మరణాలు, గోడల మీద రహస్య రాతలు, పాయల్ రాజ్‌పుత్ పోషించిన 'శైలజ' పాత్రలోని అరుదైన మానసిక స్థితి, అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'మంగళవారం' చిత్రానికి ప్రాణం పోశాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న రెండో భాగంలో అంతకుమించిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో భయపెట్టి అలరించబోతున్నాయో అని సినీ ప్రేమికుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. రూరల్ మిస్టరీకి సూపర్ నేచురల్ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విజృంభణ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజయ్ భూపతి మార్క్ రా అండ్ బోల్డ్ టేకింగ్, కొరటాల శివ నిర్మాణ ప్లానింగ్ కలిస్తే 'మంగళవారం 2' టాలీవుడ్లో మరో సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. Mangalavaaram 2 Ajay Bhupathi Koratala Siva, Srinivasa Mangapuram
Jul 24, 2026 2:33PM
టాలీవుడ్ డైరెక్టర్ స్కెచ్.. భారీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి.!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెప్పే ఈ లేడీ పవర్ హౌస్, ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో క్లాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు తిరుమల కిషోర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. దర్శకుడు తిరుమల కిషోర్ ఈ కథను ప్రత్యేకంగా సాయి పల్లవి ఇమేజ్ను, ఆమె అద్భుతమైన నటనా ప్రతిభను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నారట. ఇటీవల సాయి పల్లవిని కలిసి ఆయన ఈ విభిన్నమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో సానుకూలంగా స్పందించారని తెలిసింది. సాధారణంగా కథల ఎంపికలో బాగా జాగ్రత్తలు తీసుకునే సాయి పల్లవి, ఈ స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మొగ్గు చూపడం చూస్తుంటే కథ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి పల్లవికి ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది. Sai Pallavi, Lady Oriented Movie, Kishore Tirumala, Tollywood, Telugu Cinema
Jul 23, 2026 3:21PM
అల్లు అర్జున్ సరసన మళ్లీ బుట్టబొమ్మ.. హాట్ టాపిక్‌గా మారిన న్యూస్.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. 'పుష్ప' సిరీస్ తెచ్చిన కనీవినీ ఎరుగని విజయం తర్వాత, బన్నీ ఎంచుకునే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నారనే వార్త సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది. కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా లోకేష్కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఉండే ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లే, డార్క్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే అల్లు అర్జున్ కింగ్ సైజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సంచలన కలయికకు సంబంధించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూడో సినిమా ఇది అవుతుంది. గతంలో 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో బన్నీ, పూజాల మధ్య పండిన కెమిస్ట్రీ, 'బుట్టబొమ్మ' పాటలో వారి డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ కాంబినేషన్ తెచ్చిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే హిట్ పెయిర్ తెరపైకి రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ గత చిత్రం 'కూలీ'లో మోనికా సాంగ్ తో పూజ మెస్మరైజ్ చేయడం విశేషం. పైగా, లోకేష్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలుగా తీర్చిదిద్దడం ఆయన శైలి. అలాంటి విలక్షణమైన టేకింగ్‌లో పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే మూవీ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. AA23, Allu Arjun, Lokesh Kanagaraj, Pooja Hegde
Jul 22, 2026 9:34AM
ఊహించని లేడీ విలన్ ని సెట్ చేసారా..ప్రెజెంట్ అదిరిపోయే హీరోయిన్ కదా!
రికార్డులే లక్ష్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(koratala siva)మూవీ తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే. అధికారకంగా లాంచ్ అయిన ఈ మూవీ గురించి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో అయితే రోజు డిస్కర్షన్ జరుగుతూనే ఉందంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. NBK 112 గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తుంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న ఐశ్వర్య రాజేష్NBK 112 లో కీలక రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకే పరిమితమయ్యే భామలు నెగిటివ్ షేడ్స్ వైపు చూడటం చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కేవలం ఒక గ్లామర్ డాల్ లాగానో లేదా సాధారణ హీరోయిన్‌గానో కాకుండా, కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ లేడీ విలన్ రోల్లో కనిపించనుందని టాక్. కొరటాల శివ మార్క్ సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు పాత్రల మధ్య ఉండే బలమైన ఘర్షణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ పాత్రతో తలపడేలా, కథలో 100 శాతం ప్రాధాన్యత ఉండేలా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ని కొరటాల శివ అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య నటనలోని రౌద్ర రసానికి, ఐశ్వర్య రాజేష్ చూపించే నెగిటివ్ షేడ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. also read: నేషనల్ అవార్డు రాగానే ఆ మూవీ కోసం నెటిజన్స్ వెతుకులాట..ఎంతైనా ప్రేక్షకులు కదా! ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో విలక్షణమైన రోల్స్ పోషిస్తూ వస్తుంది. అలాంటిది ఐశ్వర్యకి ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి కానుంది. గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' లాంటి పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా సైకో క్యారెక్టర్లు చేయాలని బలంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. సరిగ్గా ఇప్పుడు కొరటాల శివ అలాంటి ఒక డ్రీమ్ రోల్‌ని ఆఫర్ చేసినట్లు వార్తలు రావడం చూస్తుంటే, ఐశ్వర్య ఆశ నెరవేరేలా కనిపిస్తోంది. కాకపోతే ప్రస్థుతానికి అయితే ఈ న్యూస్ రూమర్ హోదాలో హల్ చల్ చేస్తుంది.
Jul 20, 2026 5:58PM
సుకుమార్ సెంటిమెంట్.. రామ్ చరణ్ సినిమాతో ఆ రికార్డు బ్రేక్ అవుతుందా.?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకుడు సుకుమార్ కెరీర్ లో కూడా ఒక సెంటిమెంట్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అదేమిటంటే ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ను కూడా తన తదుపరి సినిమాల్లో రిపీట్ చేయలేదు. 'ఆర్య' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన సుకుమార్, నిన్నమొన్నటి 'పుష్ప' సిరీస్ వరకు ప్రతి సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ను ఎంచుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ 'RC17'తో ఈ హీరోయిన్ సెంటిమెంట్ బ్రేక్ కాబోతుందా అనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సుకుమార్ ఎప్పుడూ ఒక హీరోయిన్ తో రెండోసారి పని చేయలేదు. కానీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప' సిరీస్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ 'RC17'లో ఆమె ఫైనల్ అయితే.. సుకుమార్ తన కెరీర్ లోనే మొదటిసారి హీరోయిన్ ను రిపీట్ చేసినట్లు అవుతుంది. మరి సుకుమార్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రష్మికకే జై కొడతారా, లేక ఎప్పటిలాగే సరికొత్త ముద్దుగుమ్మను రంగంలోకి దించుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Ram Charan, Sukumar, RC17 Update, Rashmika Mandanna
Jul 20, 2026 11:46AM
రామ్ చరణ్‌కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే!
రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక చరణ్ మూవీలో ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం. Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే! ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని 90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers
Jul 17, 2026 3:54PM
ప్రభాస్ వల్ల ప్లాన్ మార్చిన బాలయ్య.!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK 111’ విడుదలపై చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ఇప్పుడు బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారడంతో సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తుండటంతో.. థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఎలాంటి క్లాష్ రాకూడదని ‘NBK 111’ మేకర్స్ భావించారు. అందుకే బాలయ్య మాస్ జాతరను డిసెంబర్ చివరి వారంలో వచ్చే క్రిస్మస్ పండుగ సెలవుల కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. పండగ సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. దసరా పండుగ కంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాలని గోపీచంద్ మలినేని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దసరా లోపు షూటింగ్ పూర్తయితే, డిసెంబర్ క్రిస్మస్ రేస్‌కు సినిమాను పర్ఫెక్ట్గా సిద్ధం చేయడానికి వీలవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. గతంలో బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమా చేసిన గోపీచంద్ మలినేని, ఈసారి ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘NBK 111’ మాస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే బాలయ్య.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సెన్సేషనల్ పొలిటికల్ డ్రామా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. Nandamuri Balakrishna, NBK 111, Christmas Release, Prabhas, Fauzi
Jul 17, 2026 10:28AM
ఆగిపోయిన అక్కినేని భారీ మూవీ.!
అక్కినేని అభిమానులకు ఒక భారీ షాకింగ్ న్యూస్ వినబడుతోంది. కింగ్ నాగార్జున తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ తో కలిసి ఒక అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా అక్కినేని ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఆశలపై ఈ తాజా వార్త గట్టి దెబ్బే కొట్టింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది జూలై నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాదు, వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ ఒక పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు జీ స్టూడియోస్ సిద్ధమైంది. అయితే, సరిగ్గా షూటింగ్ ప్రారంభం కావాల్సిన తరుణంలో ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్ వెర్షన్ విషయంలో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందలేదట. తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కథ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పాటు ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి ఆసక్తి చూపించకపోవడంతో నాగార్జున కూడా వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కుమారులకు నచ్చని ప్రాజెక్ట్‌తో బలవంతంగా ముందుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించిన నాగార్జున, ఈ మల్టీస్టారర్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయడానికే మొగ్గు చూపారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, ఇప్పుడు సినిమా రద్దు కావడంపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవచ్చు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ఆగిపోవడంతో అక్కినేని హీరోలు తమ తదుపరి సొంత ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా చేస్తున్నారు. అలాగే తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ "దూత 2"తో పాటు, దర్శకుడు క్లాక్స్‌తో ఒక సినిమా, మసూద డైరెక్టర్ సాయి కిరణ్ తో మరొక భారీ హారర్ ఫిల్మ్‌ను లైన్లో పెట్టారు. అటు అఖిల్ అక్కినేని కూడా ఖాళీగా ఉండకుండా ఇప్పటికే రెండు కొత్త స్క్రిప్ట్‌లను లాక్ చేసుకోగా, అందులో ఒక ప్రాజెక్ట్‌ను ఈ నెలలోనే ఫైనలైజ్ చేయనున్నారు. తన ఇద్దరు కుమారులు తమ సరికొత్త ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోవడంతో, నాగార్జున సైతం తన ల్యాండ్‌మార్క్ చిత్రం "కింగ్ 100" (King 100) పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. Nagarjuna, Naga Chaitanya, Akhil Akkineni, Multistarrer, Shelved
Jul 16, 2026 4:24PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



