English | Telugu

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరైనా బాలయ్య ముందు పనికిరారు!


ఆలీతో సరదాగా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి రాధా వచ్చింది. ఈ ప్రోమోలో కొన్ని హైలైట్ మాటలు రాధా ఎం చెప్పారో చూద్దాం. "మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి..మీ జోలికి ఎవరైనా వస్తే అంతేనేమో" అని ఆలీ అనేసరికి "ఎస్.. కసక్.. మడతపెట్టేస్తా" అని చెప్పారు రాధా. "రియల్ లైఫ్ లో మనలో కూడా ఒక దొంగ ఉన్నాడట కదా" అనేసరికి "ఇంటర్వ్యూకి ముందు మీరేమన్నా సిబిఐని పెడతారా ఏమిటి" అని అడిగారు . "మీకు ఒక డ్రీం బాయ్ ఉన్నాడని ఆయనతో నటించాలని అనుకునేవారట" "అబ్బాయిలు కూడా ఇంత అందంగా, ఫెయిర్ గా, యాపిల్ ల్లా ఉంటారా అని అనిపించింది" "సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరు వచ్చినా మన బాలయ్య ముందు ఎవ్వరూ పనికిరారు" అని చెప్పారు రాధా.

" ఆయన మీకు మొగుడా.. మీరే ఆయనకు మొగుడా" అని ఆలీ అడిగాడు. "అదెందుకులెండి..నా మొగుడు ఎక్కువగా మాట్లాడరు" అని చెప్పారు. "మన కృష్ణ గారి గురించి" అని ఆలీ అనేసరికి "నాకు కృష్ణ గారంటే...నేను చిరంజీవి గారిలానే డాన్స్ చేస్తా కానీ కృష్ణ గారితో షూటింగ్ కి వెళ్తే.." అని ఆపేసారు "ఒక సినిమా షూటింగ్ అయ్యాక మీరు బాధపడ్డారంటా" "అవును" అని చెప్పారు రాధా.."ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలంటే" అని ఆలీ అడిగేసరికి రాధా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆలీ కూడా కన్నీళ్లు పెట్టుకుని చాలా ఎమోషనల్ ఇపోయారు. ఇంతకూ రాధా కృష్ణ గురించి ఎం చెప్పారో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.