Read more!

English | Telugu

బ్లాక్ డ్రెస్ లో సిరి హనుమంత్.. హీటెక్కిస్తున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్!

ఇన్ స్టాగ్రామ్ లో కొందరు అందాల ఆరబోతతో ట్రెండింగ్ లో ఉంటారు‌‌. వారిలో ఒకరు అనసూయ అయితే మరొకరు ఇనయా సుల్తానా అయితే ఈ మధ్య ఆ లిస్ట్ లోకి అశ్వినిశ్రీ చేరింది. ఇప్పుడు తాజాగా సిరి హనుమంత్ చేరింది.

సిరి కొన్ని నెలల క్రితం విడుదలైన "పులి-మేక" వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మూవీలో పోలీస్ గెటప్ లో కన్పించిన సిరి మస్త్ ట్రెండింగ్ లో ఉంది.  బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన ఈ భామ అక్కడ తన పర్ఫామెన్స్ తో మాటతీరుతో ఎంతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హనుమంత్-షణ్ముఖ్ జస్వంత్‌లు హాట్ టాపిక్ అయ్యారు. బిగ్ బాస్‌కి వెళ్లకు ముందు వీళ్లిద్దరికీ లవర్స్ ఉన్నారు.  సిరి హనుమంత్‌.. శ్రీహాన్ ప్రేమలో ఉంటే.. షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైన లవ్‌లో ఉండేవాడు. కానీ బిగ్ బాస్‌కి వెళ్లిన తరువాత స్నేహం ముసుగులో సిరి-షణ్ముఖ్‌లో డీప్ లవర్స్ గా మారి రొమాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌‌ని హీటెక్కించేవారు. దాంతో బయటకొచ్చాక షణ్ముఖ్ , దీప్తి సునైనా విడిపోయారు.

కొన్నిరోజులుగా శ్రీహాన్ తో కలిసి సిరి‌ హనుమంత్‌ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. తాజాగా జబర్దస్త్ కు యాంకర్ గా వచ్చిన సిరి హనుమంత్ ఎంట్రీ సాంగ్ కోసం తెగ కష్టపడుతుంది. ఇక అప్పుడప్పుడు శ్రీహాన్ తో‌ కలిసి అవుటింగ్ కు వెళ్తూ వ్లాగ్స్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడేమో బ్లాక్ డ్రెస్ లో హీటెక్కిస్తుంది. ఆ ఫోటోషూట్ చేసిన ఫోటోలని తన‌ ఇన్ స్టాగ్రామ్ లో‌ పోస్ట్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇన్ స్ట్రాగ్రామ్ లో సిరి హనుమంత్ చేసిన ఈ ఫోటోలని మీరు చూసారా  లేదా కామెంట్ చేయండి.