English | Telugu

Guppedantha Manasu : అనుపమని కత్తితో పొడిచిన రౌడి.. మను తన కొడుకే అని తెలిసిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1028 లో... ఇన్ని రోజులు మీరు మాకు సపోర్ట్ గా ఉన్నారు.. గొప్పవారు అనుకున్నా కానీ ఇలాంటివి చేస్తారని అనుకోలేదని వసుధార అంటుంది. కనీసం మీరైనా నేను చెప్పింది వినండని వసుధారతో మను అంటాడు. మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీరు వెళ్లిపోండి అని వసుధార అనగానే మను వెళ్ళిపోతాడు. సారీ అమ్మ అని అనుపమ అనగానే.. మీరెందుకు సారీ చెప్తున్నారని వసుధార అంటుంది. అంటే నువ్వు తన గురించి చెప్పినప్పుడు మేమ్ నమ్మలేదు కదా అని అనుపమ అంటుంది.

ఆ తర్వాత అనుపమ చింపేసిన పోస్టర్ శైలేంద్ర అతికిస్తూ ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని మను ఫోటో చూస్తు అనుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాలని శైలేంద్ర అనుకుంటాడు కానీ రాజీవే ముందు చెప్తాడు. నీకెలా తెలుసని శైలేంద్ర అడుగుతాడు. ఇలాంటివి తెలుసుకోవడమే నా పని కదా అంటు రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఆ మను గాని పీడపోయిందని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రౌడీకి ఫోన్ చేసి.. నువ్వు ఆ మనుని ఏం చెయ్యకని శైలేంద్ర రౌడీతో అంటాడు. మీరు ఒకసారి పని అప్పజెప్పాక వదలనని రౌడీ చెప్తాడు. ఆ తర్వాత మను వెళ్ళిపోతుంటే మహేంద్ర ఎదురు పడి.. నేను రిషి కోసం ఈ కంకనమ్ తీసుకున్నాను కానీ నువ్వు పరిచయం అయ్యి మాకు చాలా సపోర్ట్ గా ఉన్నావ్. అందుకే నీకు ఇవ్వాలని అనుకుంటున్నానని అనగానే వద్దని మను అంటాడు. నేను వెళ్లిపోతున్నా సర్ అని మను అనగానే.. ఎక్కడికి అని మహేంద్ర అడుగుతాడు.

ఆ తర్వాత మను వెళ్లిపోతుంటే రౌడీ వెనకాలే కత్తి పట్టుకొని వస్తాడు. అది చూసిన అనుపమ.. మను అంటూ పిలుస్తూ మనుకి అడ్డుగా వస్తుంది. కత్తి అనుపమ కడుపులో దిగుతుంది. అమ్మ అంటు అనుపమని మను పిలుస్తాడు. దాంతో వసుధార, మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే అనుపమని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. మను అనుపమ కొడుకా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత అనుపమ, మనుకి మధ్య జరిగిన గొడవని మను గుర్తుకుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.