English | Telugu

పవన్ కళ్యాణ్ వల్లనే ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది

ఈవారం రావోయి చందమామ వెర్సెస్ మా అత్త బంగారం సీరియల్ టీమ్స్ సుమ అడ్డా షోకి వచ్చాయి. ఇక ఈ షోలో ఈ రెండు సీరియల్ టీమ్స్ వాళ్ళతో చాలా గేమ్స్ ఆడించింది సుమ. రావోయి చందమామ సీరియల్ యాక్టర్ ఐన సెల్వ రాజ్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. " మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది..ఎలా జరిగింది" అని అడిగింది. "ఒకసారి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది నాకు. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయ్యింది. సేమ్ సినిమా స్టయిల్లో అయ్యింది పెళ్లి. కట్టుబట్టలతో కాలేజీ నుంచి ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నా. అవతల వాళ్లకు గట్టిగానే ధమ్కీ ఇచ్చాను.

అవకాశం కావాలంటే...అమ్మాయిలు డేట్స్ కి రావాలి!

లంబసింగి మూవీ ద్వారా దివి, భారత్ అనే నటీ నటులు పరిచయం అయ్యారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని వీళ్ళు కలిసి చేసారు. ఐతే రీసెంట్ గా వీళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఫేక్ ఆడిషన్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు. "ఈ మధ్య కాలంలో ఫేక్ ఆడిషన్స్ చాలా జరుగుతున్నాయి. మీకు కావాల్సిన పర్సన్ ఉన్నప్పుడు ఎందుకు ఆడిషన్స్ ని ఏర్పాటుచేయడం..వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఎందుకు బాధపెట్టడం. యూట్యూబ్ వ్యూస్ తో వేరేవాళ్లను  క్రష్ చేసేసి ఆ వ్యూస్ తో వచ్చే డబ్బుతో నువ్వు తినడం ఏమిటి. ఇదే సెల్ఫ్ అబ్యూజ్ కదా. అక్కడ నీ సెల్ఫ్ హానెస్టీ అని ఒకటి ఉంటుంది కదా ఈ విషయం మీద నిజంగా నిజాయితీ ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి...

మన దేశం మనకు గర్వం వాళ్ళ దేశాలకు అంత సీన్ లేదు...

ఆలీతో సరదాగా సీజన్ 2 లో ఈ వారం బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ ని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ ని నెక్స్ట్ వీక్ షోకి ఇన్వైట్ చేశారు. ఈ ప్రోమోలో ఇద్దరూ కొన్ని హైలైట్ పాయింట్స్ ని చెప్పారు. "ఆయన క్రికెట్ నేను బాడ్మింటన్ కానీ చాముండేశ్వరి గారు అన్ని స్పోర్ట్స్ కి బాగా క్లోజ్...స్కూల్ లో అటెండెన్స్ తీసుకునేటప్పుడు నా పేరు స్కిప్ చేసేవాళ్ళు..స్కూల్ మొత్తం చప్పట్లు కొడుతూ ఉంటే నేను క్లాస్ బయట మోకాళ్ళ దండ వేసేవాడిని...ఒలింపిక్స్ ఆడి వచ్చి ఒక అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇచ్చి కింద ఐ లవ్ యు అని రాసా నోటితో మాత్రం చెప్పలేదు.