మూడు ఛానెల్లలో మూడు సీరియల్స్ ప్రారంభం.. సివంగి సీరియల్ అదే రోజున!
ఇక మరికొన్ని రోజులలో టీవీ అభిమానులకి పండగ మొదలవ్వనుంది. జీ తెలుగు, స్టార్ మా , జెమిని టీవీలలో మార్చి 25 న కొత్త సీరియల్స్ ప్రారంభం కానున్నాయి. జీ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వారి ' మా అన్నయ్య' సీరియల్, స్టార్ మా టీవీలో ' కార్తీకదీపం- 2'.. జెమిని టీవీలో ' సివంగి' సీరియల్ ప్రారంభం అవ్వబోతున్నాయి.