English | Telugu

నీతోనే డాన్స్ సీజన్ 2 రెడీ...

నీతోనే డాన్స్ 2 . 0 రెడీ ఐపోయింది. ఇక డాన్స్ లవర్స్ కి పండగే పండగ. ఈ షో నెక్స్ట్ సీజన్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి ఇంతకుముందులాగే శ్రీముఖి హోస్ట్ గా చేస్తోంది. ఈ నెల 23 న గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది ఈ సీజన్. అలాగే ప్రతి శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఇందులో 10 జోడీలను తీసుకొచ్చారు. మళ్ళీ జడ్జ్ గా రాధ, సదా, తరుణ్ మాష్టర్ వచ్చేసారు. జోడీస్ గా  మానస్-శుభశ్రీ రాయగురు, నయని పావని-ప్రిన్స్ యావర్, విశ్వ-నేహా, బాలాదిత్య -పూజా మూర్తి, దర్శినిగౌడ-పృథ్వీ శెట్టి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హరిక ప్రస్తుతానికి ఈ జంటలు తెలుస్తున్నాయి. ఇక మరో మూడు జంటలు ఎవరు అని తెలియాల్సి ఉంది.  

కలెక్షన్ కింగ్ కి విషెస్ చెప్పిన కౌశల్...

నిర్మాతలకు  'కలెక్షన్‌ కింగ్‌ గా, అభిమానులకు 'డైలాగ్‌ కింగ్‌' గా ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పారు ఆరడుగుల మంచు మోహన్ బాబు. ఆయనొక విలక్షణ నటుడు. సిల్వర్ స్క్రీన్ మీద విలన్‌గా , హీరోగా ఆకట్టుకున్నారు. అలాంటి పెదరాయుడు పుట్టిన రోజు ఈరోజు. ఆయన పుట్టినరోజును మంచు విష్ణు, మంచు మనోజ్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. మరి వాళ్ళే కాదు ఆయన్ని ఎంతో అభిమానించే బుల్లితెర నటుడు, బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా కూడా సెలెబ్రేట్ చేశారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు, సర్ ! వృత్తి మీద మీకు ఉన్నా డెడికేషన్, మీ పాత్రల్లో మీరు చూపించే ప్రొఫెషనలిజం, మీ నిబద్ధతకు నేను ఎప్పుడూ ముగ్దుడనైపోతుంటాను.