Read more!

English | Telugu

Guppedantha Manasu : తల్లిని ఐసీయూలో చూసి అల్లాడిన మను.. వసుధారకి నిజం తెలిసేలా చేసిన పీఏ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1029 లో..అనుపమ, మను ఇద్దరు తల్లికొడుకులా అసలు వాళ్ళని అడిగితే పరిచయం లేదన్నారని మహేంద్ర అనుకుంటాడు. వీళ్ళ మధ్య ఏదో సంబంధం ఉందనుకున్నాను కానీ తల్లికొడుకులని అనుకోలేదని వసుధార కూడ అనుకుంటుంది. మేడమ్ కు ఏం కాదు కదా అంటు మహేంద్రని మను హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు.

లేదు సర్.. నా కాళ్లూ చేతులు ఆడటం లేదు. నా గుండె ఆగినంత పని అవుతుందని మను అంటాడు. నువ్వు అధైర్యపడకు ప్లీజ్ మను అని మహేంద్ర ఓదార్చుతాడు. ఇంతలో నర్స్ వచ్చి.. సర్ ఎన్ఓసీ ఫామ్‌పై సంతకం చేయండని అనగానే.. మను కంగారు పడుతు ఆ ఫామ్‌పై సంతకం చేస్తాడు. మేడమ్‌కి ఎలా ఉంది సిస్టర్.. బాగానే ఉన్నారు కదా.. మేడమ్‌కి ఏం కాలేదు కదా? అని కంగారుగా అడుగుతాడు. సర్.. మీకు కంగారు పడకండి. ట్రీట్ మెంట్ జరుగుతుందిని నర్స్ అంటుంది. ఇక అనుపమపై కత్తితో దాడి చేసిన కిరాయి హంతకుడ్ని శైలేంద్ర కలుస్తాడు. రేయ్ రేయ్.. నీకు ఏం చెప్పాను.. ఏం చేశావ్.. వాడిని వదిలేయరా అంటే.. నేను పోటుగాడ్ని.. అడ్వాన్స్ తీసుకున్నాక వెనక్కి తగ్గనని బిల్డప్ కొట్టావ్.. ఇప్పుడేంట్రా ఇలా చేశావ్? వాడ్ని పొడవబోయి అనుపమని పొడిచావ్.. నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎప్పుడైనా పనికొచ్చే పని చేశావారా అని శైలెంద్ర అంటాడు. ఎందుకు చేయలేదు సర్.. నేను కథలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ మీకో కొత్త విషయం తెలుస్తుంది. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి అని ఆ కిరాయి హంతకుడు‌ అంటాడు. దాంతో శైలేంద్ర ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు. గతంలో రిషి, వసుధారలను చంపడానికి ఈ కిరాయి హంతకుడే ప్రయత్నించడం.. వాళ్లని అనుపమ కాపాడటం.. అనుపమ ఫొటోని చూసిన దేవయాని.. ఇది మామూల్ది కాదురా.. నాకే చుక్కలు చూపించిందని దేవయాని చెప్పడాన్ని గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. అలాగే అనుపమని కత్తితో పొడవగానే.. మను అమ్మా అని పిలవడాన్ని శైలేంద్ర గుర్తుచేసుకుంటాడు. ఏంటి భయ్యా.. వాడేదో కొత్త విషయం అంటున్నాడు.. నీకు ఏమైనా తెలిసిందా అని శైలేంద్రను రాజీవ్ అడుగుతాడు రాజీవ్. ఇక హాస్పిటల్‌కి అనుపమ పెద్దమ్మ వస్తుంది. ఓల్టీని చూసి మను కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైంది నాన్నా.. ఇదంతా ఎలా జరిగిందని ఓల్డీ అడుగుతుంది. నా ప్రాణం కాపాడటానికి తన ప్రాణం అడ్డు వేసిందని మను చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి.. బ్లడ్ ఎక్కువగా పోయింది.. ఆమె ప్రస్తుతం సృహలో లేరు.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.. కాసేపట్లో కోలుకుంటారు.. తరువాత వెళ్లి మాట్లాడొచ్చని చెప్తుంది. ఆ మాటతో హమయ్య అని మను గుండెలపై చేయి వేసుకుని హమ్మయ్య అని అనుకుంటాడు.

ఆ తరువాత ఓల్డీ దగ్గరకు వెళ్లి.. నేను ఆమెకి ఇచ్చిన మాట తప్పాను..‌ ఆమె వద్దన్న పని చేశానని మను అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నా అని ఓల్డీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో మను.. నీకు అసలే హెల్త్ బాలేదు.. నువ్వు ఇంటికి వెళ్లు.. నేను చూసుకుంటానులే‌నని మను అంటాడు. లేదు నాన్నా.. నేను వెళ్లలేనని తను అంటుంది. నా మాట విను ఓల్డీ.. కోలుకున్నాక నేనే తనని నీ దగ్గరకు తీసుకుని వస్తానని మను అంటాడు. నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావని ఓల్డీ అంటే.. నేను ఒంటరిగా లేను. వీళ్లంతా తోడుగా ఉన్నారు కదా అని‌ మను అంటాడు. దాంతో మహేంద్ర.. మీరు వెళ్లండమ్మా.. మనుకి మేమ్ తోడుగా ఉంటాం.. మీరు భయం పెట్టుకోకండని అంటాడు. దాంతో ఓల్డీని కారు దగ్గరకు తీసుకుని వెళ్తాడు మను. ఇంతలో మను పీఏ వచ్చి.. వసుధారకి మను గురించి నిజం చెప్తాడు. మీరు మా సర్‌ని అపార్ధం చేసుకున్నారు మేడమ్.. ఆ పోస్టర్ సర్ క్రియేట్ చేసింది కాదు.. మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉందని పీఏ అంటాడు. మను చేయకపోతే ఆ పని ఎవరు చేస్తారంటూ వసుధార అనగా.. రాజీవ్ పోస్టర్లు అతికిస్తున్న వీడియోను వసుధారకి చూపిస్తాడు. వీడియో చూసిన తరువాత వసుధార కళ్లు తెరుచుకుంటాయి. మీ గురించి మను సర్ గురించి బ్యాడ్ చేయాలని ఆ రాజీవ్ ప్లాన్ చేసి.. మీ పోస్టర్లు కాలేజ్‌లో అతికించాడు.. ఆ పోస్టర్స్ ప్లేస్‌లో మను సర్.. మీ బర్త్ డే పోస్టర్లను అతికించారు. ఇందులో సర్ తప్పేం లేదు. ఆ పోస్టర్లు అంటించిన విషయంలోనూ.. ఇప్పుడు చేయని తప్పుకి దోషిగా నిలబడ్డారు. అందరిలాగే మీరు కూడా ఆయన్ని దోషిగానే చూశారు. కానీ సర్.. ఎప్పుడూ నోరు తెరిచి నిజం చెప్పరు. నిజం ఎప్పుడు దాగదని నిజం వైపే నిలబడతారని చెప్పి వసుధార కళ్లు తెరిపిస్తాడు మను పీఏ. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.