Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో ఊహించని ట్విస్ట్!

 

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -51 లో....  మాణిక్యం అతని ఫ్యామిలీ కలిసి సీతాకాంత్ వాళ్ళింటికి పెళ్ళి గురించి మాట్లాడటానికి వస్తాడు. అయితే అక్కడ మాణిక్యం పెద్ద ఫోటో ఒకటి ఉండటం చూసి రామలక్ష్మి, ధన అతని చెల్లి అంతా షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటారు. ఈ పెళ్ళి నాకు ఒకే అని సీతాకాంత్ చెప్పగానే.. ఒకే పదండి అందరం వెళ్దామని మాణిక్యం అతని ఫ్యామిలీకి చెప్తుంటాడు.

అదేంటి నేను ఒప్పుకున్నాను కదా అని సీతాకాంత్ అనగానే.. నువ్వు ఒప్పుకున్నావ్ కానీ మీ కుటుంబం ఒప్పుకోలేదు కదా.. మేమందరం ఫ్యామిలీతో కలిసి వచ్చి మాట్లాడుతున్నాం.. కానీ మీ అమ్మగారు లేరు కదా.. అంటే మీ అమ్మగారికి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా మేమ్ వెళ్ళొస్తామని మాణిక్యం అంటాడు. ఒక్క నిమిషం నేను వెళ్ళి తీసుకొస్తానని సీతాకాంత్ మేడ మీదకి వెళ్తాడు. కాసేపటికి శ్రీలతని తీసుకొస్తాడు సీతాకాంత్. ఇక ఆమె రాగానే మాణిక్యం కాలు మీద కాలు వేసుకొని కూర్చొని..నమస్కారం చెల్లెమ్మ అంటు వినయాన్ని నటిస్తాడు. ఇక శ్రీలత కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఇద్దరి పెళ్ళి ఒకే ముహుర్తానికి , ఒకే రోజున, ఒకే మండపంలో జరగాలని సీతాకాంత్ తో మాణిక్యం అనగానే మొదట ఈ ఇంటి ఆడపడుచు మా చెల్లి సిరి వివాహం జరగాలని సీతాకాంత్ అనగానే.. అలా కుదరదని మాణిక్యం అంటాడు. అదేంటి నాన్న అన్నీ నువ్వు అనుకున్నట్టే సాగుతాయా.. వాళ్ళ ఆచారాలని కూడా మనం గౌరవించాలి కదా అని రామలక్ష్మి, ధన అంటారు. అయిన మాణిక్యం వినడు. ఇక మాణిక్యం లేచివెళ్ళిపోతుంటే సరే ఓకే ఇద్దరి పెళ్ళి ఒకేసారి అని సీతాకాంత్ అనగానే మాణిక్యం కూర్చుంటాడు. ఇక షాక్ అయిన రామలక్ష్మి ఒక్క నిమిషం సర్ అని సీతాకాంత్ ని బయటకు తీసుకెళ్తుంది.  ఏంటి సర్ ఇది.. మనకన్నా ముందు మా నాన్న వ్యూహం పన్నాడని రామలక్ష్మి అనగానే.. అందుకే ఇలాంటిదేదో చేస్తాడనే నేను ఓ పంతులిని సెట్ చేశాను. అతను మా జాతకాలు చూసి మొదట ధన‌, సిరిల పెళ్ళి జరగాలని చెప్తాడని రామలక్ష్మితో సీతాకాంత్ తన ప్లాన్ మొత్తం చెప్తాడు. దాంతో రామలక్ష్మి మాములు అవుతుంది.‌

ఇక కాసేపటికి పంతులు గారు వస్తారు. ఇద్దరి జాతకాలు చూసి మొదట ఒక్కజంట పెళ్ళి జరగాలి ఆ తర్వాత మరో జంట పెళ్ళి జరగాలని‌ లేకపోతే అరిష్టమని పంతులు‌ చెప్తాడు. దాంతో మాణిక్యం సరేనంటాడు. అయితే ఆ మొదట జరిగే పెళ్ళి నా కూతురు రామలక్ష్మితో అల్లుడు సీతాకాంత్ కి పెళ్ళి జరగాలని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మొదట ఈ ఇంటి ఆడపిల్ల వివాహం ఆ తర్వాతే అన్నయ్య వివాహం జరగాలని లేకపోతే సీతాకాంత్ వాళ్ళ మామకి ప్రాణగండం ఉందని చెప్తాడు. అయ్య బాబోయ్.. అదేంటి వడియాలు ఆరబోసిన రోజునే వడగల్ల వాన పడ్డట్టు ఈ పెళ్ళి అయితే బాబాయ్ కే ప్రమాదామా అని శ్రీవల్లి అంటుంది‌. ఇక రామలక్ష్మి కూడా ప్రమాదమైతే వద్దు నాన్న వారం మాత్రమే కదా..  అ తర్వాత చేసుకుంటాములే అని రామలక్ష్మి అంటుంది. మేము పెళ్ళికి ఒప్పుకున్నాం కదా అని సీతాకాంత్ అంటాడు. మీరంతా ఒకే అంటున్నారు‌ కదా సరేనని మాణిక్యం అంటాడు. నేను శేషాచారి గారి శిష్యుడిని ఈ జాతకాలు ఎవరికి చూపించినా ఇదే చెప్తారని ఆ పంతులు అనగానే.. సరేనని ధన దగ్గర మాణిక్యం ఫోన్ తీసుకొని మాట్లాడతాడు. హలో శేషాచారి గారా అని మాణిక్యం అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.