Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ముకుంద దెయ్యమై పీడిస్తుందని నమ్మేసిన మురారి.. కృష్ణ  చేస్తున్న శాంతిహోమం ఫలించేనా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -423 లో... కృష్ణ, మురారి  బైక్ పై వెళ్తుంటే కృష్ణ చీర బైక్ వీల్ కి చిక్కుకొని ఇద్దరు పడిపోతారు. ఇద్దరికి చిన్నచిన్న గాయాలవ్వడంతో కాసేపు అంతా చూసుకుంటారు. ఇక అప్పుడే ముకుంద కార్ లో వెళ్తూ నవ్వుకుంటూ మురారికి కన్పిస్తుంది. అది చూసిన మురారి నిజమా కలయా అని అంటాడు.

మురారి, కృష్ణలు వెళ్లాల్సిన ఆసుపత్రికి.. ముందే వెళ్లిపోతుంది ముకుంద. కృష్ణను మురారి లేపి.. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ షాప్ దగ్గర కూర్చోబెట్టి వాటర్ తాగిస్తాడు. ఆసుపత్రికి ఓపెనింగ్‌కి మనం వెళ్లడం లేదు కృష్ణ.. నువ్వు వద్దన్నా తీసుకొచ్చి తప్పు చేశాను. రావట్లేదని వాళ్లకు కాల్ చేసి చెప్పేస్తానంటూ హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు. ఇక అవతలివైపు ఫోన్ ముకుంద ఎత్తుతుంది. హలో..హలో నేను మురారీని.. ఆసుపత్రి ఓపెనింగ్‌కి రావడం లేదు.. సారీ.. రాజేశ్వరి మేడమ్‌కి మీరు చెబుతారా అని మురారి అంటాడు. అవతల నుంచి ముకుంద పెద్దగా నవ్వుతుంది. మురారీకి అర్థం కాదు. హలో హలో అని మురారి అంటాడు. నేను ముకుందను.. నేను ముందే చెప్పానుగా చిలక్కు చెప్పినట్లు.. విన్నావా? ఇప్పుడు చూడు చిన్న ప్రమాదంతో సరిపోయింది. అయినా ప్రాణంగా ప్రేమించిన నిన్ను‌.. నేనెలా వదిలేస్తానని అనుకున్నావు. వదలను.. నువ్వు నిజంగానే కృష్ణకు ఎంత దూరంగా ఉంటే తను అంత సేఫ్‌గా ఉంటుంది. ఈసారి చిన్న దెబ్బతోనే పోయింది. మరోసారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేను కదా అని ముకుంద నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది.

అది విని మురారి షాక్ అయిపోతాడు. ముకుంద మాటలకు ఏం చెయ్యాలో మురారికి అర్థం కాదు. వెంటనే కంగారుగా రీడైల్ చేస్తాడు మురారి. అప్పుడు అక్కడున్న ఓ రిసెప్షనిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి.. హలో చెప్పండి అంటాడు. ఇంతకు ముందు మాట్లాడింది ఎవరని మురారి అనగానే.. ఇంతకు ముందా.. అసలు ఇప్పుడే కదా ఫోన్ వచ్చింది.. మీరెవవరికి చేశారో అని మురారితో అతను అంటాడు. దాంతో మురారి షాక్ అవుతాడు. కాసేపటికి ముకుంద కొంతడబ్బుని ఆ రిసెప్షనిస్ట్ కి ఇస్తుంది. వాడు ముకుంద దగ్గర డబ్బు తీసుకుని అబద్దం చెప్పిన విషయం మురారీకి తెలియకపోవడంతో.. మురారి నిజంగానే భయడపతాడు. ముకుంద చచ్చికూడా నన్ను సాధిస్తుందా అని మురారి తన మనసులో అనుకుంటాడు. 

ఇక మురారి ఇంటికి వెళ్లి కూడా అదే ఆలోచిస్తాడు. ముకుంద నిజంగానే ఆత్మలా నన్ను వెంటాడుతుందన్న మాట. ఇంతకాలం నేను నమ్మలేదు. కానీ కృష్ణకు దూరంగా లేకపోతే ఆ ముకుంద అన్నంత పని చేస్తుందేమో.. కృష్ణకు దూరంగా ఉండటం ఒక్కటే మార్గమా.. అది ఎలా సాధ్యమని మురారి అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేదు కాబట్టి శాంతి హోమం చేయిద్దామని కృష్ణ అంటుంది‌. దాంతో రేవతి పంతుల్ని పిలిపిస్తానని అంటుంది. మరోవైపు ఓ డాక్టర్‌కి ముకుంద చెక్ రాసి ఇచ్చి.. అనుకున్నది అనుకున్నట్లే కావాలని అంటుంది. దానికి సరేనంటుంది ఆ డాక్టర్. ముకుంద ఆపరేషన్ మొదలైపోతుంది.

పూర్తైన తర్వాత ముకుంద ముఖానికి చుట్టిన గుడ్డ విప్పేందుకు డాక్టర్ వచ్చి కత్తెరతో వాటిని విప్పుతూ ఉంటుంది. ఎదురుగా అద్దం పట్టుకుని కాంపౌండర్ ఉంటాడు. ఒక నర్స్ డాక్టర్‌కి సాయం చేస్తూ అక్కడే ఉంటుంది. ఇంతలో ఇంట్లో శాంతి పూజ జరిపించడానికి పంతులు వస్తాడు. ముకుంద ఫొటోను ఎదురుగా పెట్టి.. ఆదర్శ్‌ని పూజలో కూర్చోమంటారు రేవతి వాళ్లు. ఆదర్శ్ ఆవేశంగా పూజ మధ్యలోంచి లేచి.. ‘నాకు ఇష్టం లేదు పిన్నీ.. అరిష్టం జరగుతుంది అని నువ్వు భయపడుతున్నావ్ పిన్నీ. .కానీ జరగాల్సిన అరిష్టం ఎప్పుడో జరిగిపోయింది’ అంటూ ముకుంద ఫొటోని చూపించి లోపలికి వెళ్లిపోతాడు. అప్పటికే ముకుంద తన కొత్త ముఖాన్ని అద్దంలో చూసుకుంటయ మురిసిపోతూ ఉంటుంది. ఆదర్శ్ వెళ్లిపోవడంతో.. ఏదైనా అరిష్టమా పంతులుగారు అంటుంది కృష్ణ కంగారుగా. ‘అతడు చేయాల్సిన క్రతువు అతడు పూర్తి చేశాడులే.. కంగారు పడాల్సింది లేదు. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా పూజను మీ దంపతులు పూర్తి చేయండి’ అంటాడు పంతులు. దాంతో మురారీ, కృష్ణలు పూజలో కూర్చుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.