గుప్పెడంత మనసు కాలేజీలో దెయ్యం.. జగతి మేడం అనుకుంటా సర్ అంటున్న నెటిజన్స్!
గుప్పెడంత మనసు సీరియల్ ఫీవర్ ఆడియన్స్ లో చాలా ఉంది. ఆ సీరియల్ లో డిబిఎస్టి కాలేజీకి మంచి పేరు వచ్చింది. ఆ కాలేజీ వాతావరణం కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. విశాలమైన ప్రాంతంలో కొంతమందే స్టూడెంట్స్ ఉండడం. చుట్టూ చెట్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిషి, మహేంద్ర, జగతి కార్లు అక్కడికి వేసుకుని రావడం . ఇక వసు, రిషి కాలేజీ మెట్ల మీద చెట్ల కింద , గట్ల మీద కూర్చుని ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ ఉండడం. అలాంటి కాలేజీ గురించి ఆ సీరియల్ ఫాదర్ మహేంద్ర భూషణ్ ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ కాలేజీ సుమారు 25 టు 30 కోట్లు ఉంటుందట..కానీ అతి తక్కువలో అంటే సుమారు రెండున్నర కోట్లకు అమ్మేస్తే తాను కొనుక్కున్నట్లు చెప్పాడు. అంత కాస్ట్లీది తక్కువకు దొరికేసరికి కొనేసుకుని చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు.