Read more!

English | Telugu

Eto Vellipoindhi Manasu : ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. అదేంటో తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -50 లో....ఇంట్లో రామలక్ష్మి లేదని‌ ఎక్కడికి వెళ్లిందని పింకీని‌ మాణిక్యం అడుగుతాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది.. నీ గురించి ఇప్పుడే పింకీని అడుగుతున్నానని మాణిక్యం అంటాడు. రామలక్ష్మి వచ్చి నేను సీతాకాంత్ సర్ తో పెళ్లికి ఒప్పుకుంటున్నా అని అనగానే మాణిక్యం చాలా సంబరపడతాడు.

ఆ తర్వాత వాళ్ళ అమ్మ సుజాత వచ్చి.. నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావని అడుగుతుంది. మీ నాన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా అంటు రామలక్ష్మిని సుజాత కోప్పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాణిక్యం దగ్గరికి వచ్చి.. రామలక్ష్మితో పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్పగానే మాణిక్యం నమ్మడు
 అంత ఈజీగా అల్లుడు ఒప్పుకుంటాడని అనుకోవడం లేదు. నేను నమ్మను వీడియో కాల్ చెయ్యండి.. అల్లుడు వీడియో కాల్ లో చెప్తేనే నేను నమ్ముతానని మాణిక్యం అంటాడు. పెద్దాయన సీతాకాంత్ కి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు సీతాకాంత్ మాణిక్యంతో రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటున్నా అని చెప్పగానే మాణిక్యం ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.. ఆచారం ప్రకారం మేమే మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతామని పెద్దాయనకి మాణిక్యం చెప్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, తన అమ్మ‌ సుజాత, పింకీలు సీతాకాంత్ ఇంటికి వస్తారు. ఆ తర్వాత ధన, మాణిక్యం లు వస్తారు. సెక్యూరిటీ లోపలకు రానివ్వడు. శ్రీలతకి సెక్యూరిటీ ఫోన్ చేసి.. మాణిక్యం అంట వచ్చారని అనగానే లోపలికి పంపొద్దని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. సీతాకాంత్ సెక్యూరిటీతో మాట్లాడతాడు. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. సీతాకాంత్ రామలక్ష్మిపై ప్రేమని  తనలోనే దాచుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ మేకొకటి చూపించాలంటు మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని ఆ ఇంట్లో ఉన్నా తన పెద్ద ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అది చూసి వాళ్ళంత షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.