English | Telugu

బుల్లితెరపై 'ఆర్ఆర్ఆర్' సందడి.. టీఆర్పీ రేటింగ్స్ లో కొత్త రికార్డు ఖాయం!

Publish Date:Aug 11, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చ్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మే 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ హాలీవుడ్ స్టార్స్ ని సైతం ఫిదా చేసింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో సంచనాలు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైంది. 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒక రోజు ముందుగా ఆగస్టు 14న బుల్లితెరపై 'ఆర్ఆర్ఆర్' సందడి చేయనుంది. 'స్టార్ మా'లో సాయంత్రం 5:30 కి తెలుగు, ఏషియన్ నెట్ లో రాత్రి 7 గంటలకు మలయాళం, జీ సినిమాలో రాత్రి 8 గంటలకు హిందీ భాషల్లో ప్రసారం కానుంది. థియేటర్స్, ఓటీటీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'.. టీవీలలో టీఆర్పీ రేటింగ్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఎంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టినా అమ్మని ద‌క్కించుకోలేక‌పోయాం!

Publish Date:Jul 25, 2022

  బాల‌న‌టునిగా 'అత‌డు', 'ఛ‌త్ర‌ప‌తి' సినిమాల‌తో ఆక‌ట్టుకొని, ఆ త‌ర్వాత హీరోగా 'ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌', 'ఒక క్రిమిన‌ల్ ప్రేమ క‌థ' లాంటి సినిమాల‌తో యూత్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు మ‌నోజ్ నందం. ఆ త‌ర్వాత ఆశించిన రీతిలో అత‌డి కెరీర్ ఊపందుకోలేదు. ప్ర‌స్తుతం ఒక‌వైపు హీరోగా న‌టిస్తూ, మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు చేస్తూ వ‌స్తున్నాడు. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ 'సీతారామం'లో ఆర్మీమేన్‌గా స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.  మ‌నోజ్ వాళ్ల‌మ్మ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ 2015లో మృతి చెందారు. "2012లో ఆమెకు కేన్స‌ర్ అని తేలింది. 2015లో చ‌నిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో వ‌ర‌స‌పెట్టి సినిమాలు చేసేశాను. కార‌ణం, నాకు డ‌బ్బు అవ‌స‌రం ఉంది. అమ్మ హాస్పిట‌ల్ బిల్స్‌కీ, ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల‌కు డ‌బ్బు బాగా అవ‌స‌రం అయ్యింది." అని తెలుగువ‌న్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో అత‌ను తెలిపాడు. వాళ్ల‌ నాన్న‌ బిజినెస్‌మేన్ అయినా అంత‌గా ఆదాయం ఉండేది కాదు. "అంత‌కుముందే ఆయ‌నకు వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చాయి. ఆయ‌న ఓఎన్‌జీసీ కాంట్రాక్ట‌ర్‌గా చేసి, త‌ర్వాత హ్యాండ్‌లూమ్ బిజినెస్ చేశారు. అందులో న‌ష్టాలు వ‌చ్చాయి. అంటే ఫైనాన్షియ‌ల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. నాకు వ‌చ్చిన ప‌ని, న‌టించ‌డం. ఆ ప‌నిచేసి, డ‌బ్బులు సంపాదించి, కుటుంబానికి స‌పోర్ట్‌గా నిలిచాను. అందువ‌ల్ల డ‌బ్బుల్లేక అమ్మ‌ను చూసుకోలేక‌పోయాన‌నే గిల్ట్ అయితే లేదు. ఎంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టినా అమ్మ ద‌క్క‌లేద‌నే బాధ మాత్రం ఉంది." అని చెప్పుకొచ్చాడు మ‌నోజ్‌.

న్యూడ్ ఫొటో షూట్ చేసిన‌ ర‌ణ‌వీర్‌పై కేసు! నిపుణులు ఏమంటున్నారంటే...

Publish Date:Jul 27, 2022

  సోష‌ల్ మీడియాలో త‌న న్యూడ్ పిక్చ‌ర్స్‌ను పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ ర‌ణ‌వీర్ సింగ్‌పై ముంబై పోలీసులు మంగ‌ళ‌వారం ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అత‌నిపై చెంబూరు పోలీస్ స్టేష‌న్‌లో ముంబైకి చెందిన ఓ ఎన్జీవో, వేదిక చౌబే అనే లాయ‌ర్ ఫిర్యాదు చేశారు. బ‌హిరంగంగా అశ్లీల‌త‌ను ప్ర‌ద‌ర్శించిన అభియోగాల కింద ర‌ణ‌వీర్‌పై ఐపీసీ 292, 293, 509 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌హిళ‌ల మ‌నోభావాల‌ను ర‌ణ‌వీర్ గాయ‌ప‌రిచాడ‌నీ, త‌న ఫొటోల ద్వారా వారి స‌చ్ఛీల‌త‌ను అవ‌మాన‌ప‌ర్చాడ‌నీ త‌న ఫిర్యాదులో ఎన్జీవో ఆఫీస్ బేర‌ర్ ఆరోపించారు. ర‌ణ‌వీర్ సింగ్ 'ఎ లిస్ట్ యాక్ట‌ర్' అనీ, అత‌ని సినిమాల‌ను యువ‌త బాగా చూస్తుంటార‌నీ, అత‌ని చ‌ర్య‌ల‌కు వారు ఈజీగా ప్ర‌భావితం అవుతార‌నీ ఫిర్యాదుదారు ప్ర‌తినిధి అయిన లాయ‌ర్ అఖిలేష్ చౌబే అన్నారు. "అత‌ని ఫొటోలు అశ్లీలంగా ఉన్నాయి. డ‌బ్బు కోస‌మే అత‌ను ఆ ఫొటో షూట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అత‌నికి త‌ప్ప‌కుండా శిక్ష ప‌డాలి" అని ఆయ‌న అన్నారు. అశ్లీల‌తా నిరోధ‌క‌ చ‌ట్టం కింత చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎదుర్కోనున్న లేటెస్ట్‌ సినీ సెల‌బ్రిటీ ర‌ణ‌వీర్. ఇదివ‌ర‌కు 'ద డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో సిల్క్ స్మిత‌గా న‌టించిన విద్యా బాల‌న్‌, ఓ కొత్త సంవ‌త్స‌రం స్టేజ్ ప‌ర్ఫార్మెన్స్‌కు సంబంధించి మ‌ల్లికా షెరావ‌త్‌, ఒక ప‌బ్లికేష‌న్‌లో ప్ర‌చురిత‌మైన ఫొటోల‌కు సంబంధించి శిల్పా శెట్టి ఈ చ‌ట్టం కింద విచార‌ణ ఎదుర్కొన్నారు.  అయితే ర‌ణ‌వీర్ విష‌యంలో సీనియ‌ర్ న్యాయ‌వాది నితీన్ ప్ర‌ధాన్ అభిప్రాయం వేరుగా ఉంది. అత‌ను ఎలాంటి చ‌ట్ట ఉల్లంఘ‌న ప‌ని చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఆ ఫొటో షూట్ చేసింది మీడియా అనీ, అత‌ను స్వ‌చ్ఛందంగా ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసినా, అది చ‌ట్ట ఉల్లంఘ‌న కాద‌నీ ఆయ‌న అన్నారు. ఆర్ట్ అంటే ఏంటో ఎవ‌రైనా తెలుసుకోవాల‌నుకుంటే, వాళ్లు ఖ‌జుర‌హో దేవాల‌యాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.

విశాల్ చూస్తుండ‌గానే భూష‌ణ్ పై తిలోత్త‌మ దాడి!

Publish Date:Aug 11, 2022

చందూ గౌడ‌, అషికా గోపాల్ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ద్వారకేష్ నాయుడు, అనిల్ చౌద‌రి, ప్రియాంకా చౌద‌రి, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, శ్రీ‌స‌త్య‌, సురేష్ చంద్ర‌, జ‌య‌ల‌లిత‌, చ‌ల్లా చందు త‌దిత‌రులు న‌టించారు. సూప‌ర్ నేచుర‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. గురువారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. భూష‌ణ్ ఎక్క‌డున్నాడో తెలుసుకోవాల‌ని బ‌స్తీలోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ త‌న‌ని వెతుకుతూ గ‌ల్లీ గ‌ల్లీ గాలిస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో భూష‌ణ్ త‌మ‌కే క‌నిపించాల‌ని తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ మారు వేషాల్లో వెతుక‌డం మొద‌లు పెడ‌తారు. ఇదే స‌మ‌యంలో న‌య‌ని కూడా బ‌స్తీలోకి ప్ర‌వేశిస్తుంది. భూష‌ణ్ విశాల్ కి కానీ, తిలోత్త‌మ బ్యాచ్ కి గానీ దొరక్కూడ‌ద‌ని న‌య‌ని వెత‌క‌డం మొద‌లు పెడుతుంది. ఈ క్ర‌మంలో భూష‌ణ్ ని వెతుకుతున్నార‌ని అత‌ని భార్య‌కు తెలియ‌డంతో అక్క‌డి నుంచి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఓ పోల్ ప‌క్క‌న కూర్చున్న భూష‌ణ్ ..తిలోత్త‌మ కంటప‌డ‌తాడు. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలింద‌ని భావించిన తిలోత్త‌మ ప‌క్క‌నే వున్న ఐర‌న్ రాడ్ తో భూష‌ణ్ ని హ‌త్య చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. తిలోత్త‌మ ..భూష‌ణ్ పై దాడి చేస్తున్న దృశ్యాల‌ని విశాల్ క‌ళ్లారా చూస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  భూష‌ణ్ ని తిలోత్త‌మ హ‌త్య చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.      

'పుష్ప: ది రూల్'లో ప్రియమణి!

Publish Date:Aug 1, 2022

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్'(పార్ట్-1) పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. దీంతో పార్ట్-2 గా వస్తున్న 'పుష్ప: ది రూల్'ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా మరో కీలక పాత్ర కోసం ప్రియమణి పేరు తెరపైకి వచ్చింది. 'పుష్ప' పార్ట్-1 లో సునీల్, అనసూయ జోడిని నెగటివ్ రోల్స్ లో చూపించిన సుకుమార్.. పార్ట్-2 లో విజయ్ సేతుపతి, ప్రియమణి జోడిని అంతకుమించి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. పైగా సేతుపతికి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సేతుపతి కారణంగా తమిళ్ మార్కెట్ లో భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది. ఇక ప్రియమణికి సౌత్ తో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉంది. 'పుష్ప: ది రైజ్'పై ఏర్పడిన భారీ అంచనాల నేపథ్యంలో ఇలా స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సీతారామం

Publish Date:Aug 5, 2022

బింబిసార

Publish Date:Aug 5, 2022