Read more!

English | Telugu

మంజులను ప్రాంక్ చేసిన డాక్టర్ బాబు...


నిరుపమ్-మంజుల పరిటాల వీళ్ళిద్దరూ బుల్లితెర మీద మంచి నటీ నటులు..ఎన్నో సీరియల్ లో కూడా  నటించారు. అలాగే నిరుపమ్ కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు రోల్ లో అద్భుతంగా నటించాడు. ఇక వీళ్ళు చేసే వీడియోస్ కి కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఐతే ఇప్పుడు నిరుపమ్ ఒక ప్రాంక్ వీడియో చేసాడు. పాపం మంజుల నిరుపమ్ చెప్పే మాటలు విని పప్పులో కాలేసింది. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి నిరుపమ్ రెడీగా తలుపు తీసి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. "వెంటనే రెడీ అవ్వు మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి" అని అన్నాడు.

"ఇప్పుడు అంత ఓపిక లేదు" అంది మంజుల చెప్పింది. "ఆ ఫంక్షన్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి సెలబ్రిటీస్, పొలిటిషన్స్ అంతా వస్తున్నారు" అని నిరుపమ్ చెప్పాడు. "త్వరగా రెడీ అవ్వు" అని చెప్పి ఆ మొత్తం వీడియోని వ్లాగ్ లా తీస్తానని చెప్పి చేతిలో మొబైల్ పట్టుకుని వీడియో తీస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. కానీ తీయలేదు. ఐతే ఆ మొత్తాన్ని కూడా కెమెరాని వేరే చోట పెట్టి షూట్ చేసాడు. ఇక మంజుల చేత మూడు డ్రెస్సులు మార్పించాడు. ఈ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు అంటుండేసరికి  ఫైనల్ గా ఒక డ్రెస్ వేసుకొచ్చింది మంజుల. "డ్రెస్ మళ్ళీ మార్చమంటే మార్చను..ఓపిక లేదు అని తెలిసినా ఫంక్షన్ కి వెళదాం అంటున్నావ్ నువ్వే వెళ్ళొచ్చుగా ...ఇలా రావడమే ఎక్కువ" అని సీరియస్ గా చెప్పేసరికి ఫైనల్ గా మనం ఎక్కడికీ వెళ్లడం లేదు ఇదంతా ప్రాంక్ అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక మంజుల ఆ మాటకు షాకైపోయింది. ఇంతలా చెప్పి చివరికి ఫంక్షన్ లేదు అంటావా అని చాలా కోపం తెచ్చుకుంది. సరే వీడియో తీసావ్ గా ఏదన్నా అప్ లోడ్ చేద్దాం అని నిరుపమ్ చేతిలో మొబైల్ చూసేసరికి అందులో ఏమీ లేదు. ఇలా మంజులను ఆట పట్టించాడు నిరుపమ్.