Brahmamudi : విడాకులు ఇవ్వమని చెప్పిన ఇందిరాదేవి.. మరి కావ్య ఇస్తుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -355 లో.. కావ్య, భాస్కర్ ఇద్దరు కలిసి నడిపిస్తున్న ప్లాన్ కి రాజ్ రివర్స్ అవుతాడు. దాంతో ప్లాన్ ఏంటి ఇలా అవుతుందని కావ్య, భాస్కర్ ఇద్దరు అనుకుని డిస్సపాయింట్ గా బయటకు వెళ్తుంటారు. అప్పుడే రాజ్ పిలుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతాడు. మళ్ళీ జెలస్ గా ఫీల్ అవుతున్నాడని భాస్కర్, కావ్య ఇద్దరు అనుకుంటారు.