Read more!

English | Telugu

డాన్స్ రాదంటూ కావ్యని అవమానించిన బ్రహ్మముడి మానస్....


త్వరలో ప్రసారం కాబోతున్న నీతోనే డాన్స్ 2 .0 షో నెక్స్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షో ఫుల్ కామెడీగా ఉంది. ఇందులో జోడీగా మానస్ నాగులపల్లి - శుభశ్రీ రాయగురు డాన్స్ జోడీగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. "నేను పక్కా లోకల్" అనే సాంగ్ కి వీళ్ళిద్దరూ కూడా ఇరగదీసే పెర్ఫార్మెన్స్ చేసారు. దాంతో అందరూ ఫిదా ఇపోయారు. ఈ ప్రోమోలోకి బ్రహ్మముడి కావ్య సడెన్ గా పరిగెత్తుకుని వచ్చేసింది. "మీకు ఈ విషయం చెప్పలేకపోతున్నా.. మీ డాన్స్ అందరికీ ఒకే కానీ ఒక అమ్మాయికి మాత్రం నాట్ ఒకే అంట" అని శ్రీముఖి సీరియస్ గా చెప్పింది.

ఇంతలో బ్యాక్ గ్రౌండ్ లో "మనసున ఉన్నది" సాంగ్ ప్లే చేసేసరికి మానస్ అబ్బా అనుకుని తలపట్టుకున్నాడు. ఈ పాటతో స్టేజి మీదకు కావ్య ఎంట్రీ ఇచ్చింది. "రాజ్.. సీరియల్‌లో నీకు శ్వేత కావాలి కావ్య వద్దు..ఇక్కడైతే నీకు శుభశ్రీ కావాలా" అని అడిగేసరికి మానస్ కి ఎం చెప్పాలో ముందు అర్ధం కాలేదు. "అరేయ్ ఫస్ట్ నువ్వు డ్యాన్స్ నేర్చుకో"  అని మానస్ సలహా ఇచ్చేసరికి కావ్య ఫైర్ ఐపోయింది "నాకు డ్యాన్స్ రాదా.. చూడు" అంటూ మైక్ పక్కన పడేసి డాన్స్ ఇరగదీసింది కావ్య. అసలు చెప్పాలంటే  కావ్యకి డ్యాన్స్ రాదు.. ఇక్కడ కూడా మ్యూజిక్‌తో సంబంధం లేకుండా తనకు వచ్చిన, నచ్చిన స్టెప్పులన్నీ వేసేసి చిన్న పిల్లలా డాన్స్ చేసింది ఆమెకు తోడుగా శ్రీముఖి కూడా చిందులేసేసింది. వెనక నుంచి మానస్ ఇద్దరినీ తిట్టుకుంటూ కనిపించాడు. వీళ్ళ డాన్స్ చూసి అందరూ నవ్వేసుకున్నారు. ఇక సదా ఐతే " ఈ అమ్మాయితో నేను ప్రేమలో పడిపోయాను" అంటూ తెగ నవ్వేసింది.