అప్పట్లో సీనియర్ యాక్టర్స్ రేంజ్ వేరు...
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో ఇండస్ట్రీ సీనియర్స్ గా హరిత, ఇంద్రనీల్, అనిల్, భావన, కళ్యాణ్ వచ్చారు. జూనియర్స్ గా శ్రీకర్, హమీద, పవిత్ర, కళ్యాణ్, ప్రేరణ వచ్చారు. ఇక శ్రీముఖి సీనియర్స్ ఎవరెవరు ఏ టైంలో ఇండస్ట్రీకి వచ్చారో వాళ్ళ గురించిన విషయాలు అడిగింది. హరిత 1992 లో ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పింది. భావన 1986 లో తన నాలుగేళ్ల వయసులో వచ్చినట్లు చెప్పింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ దాటిపోయాను. మధ్యలో ఒక టు ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా..ఫేస్ మెచ్యూరిటీ లేదని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు చెప్పింది.