Read more!

English | Telugu

ఆ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ని ప్రేమించాను...


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "ఓం భీం బుష్" మూవీ టీమ్ నుంచి శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, డైరెక్టర్ శ్రీహర్ష వచ్చారు. ఇక రాహుల్ రామకృష్ణ  కామెడీ మాములుగా లేదు. ఇక గేమ్ షోలో భాగంగా "ఆనాటి జ్ఞాపకాలు అంటే గుర్తొచ్చేవి ఏమిటి" అని అడిగింది సుమ. "ఏనాటి జ్ఞాపకాలు, ఎవరి జ్ఞాపకాలు, అసలు ఎం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది ఇక్కడ" అని రాహుల్ రామకృష్ణ తన డైలాగ్స్ తో కాసేపు కామెడీ క్రియేట్ చేసాడు. తర్వాత శ్రీవిష్ణుతో మాట్లాడింది సుమ "మీ తొలిప్రేమ గురించి మీరు చెప్పండి" అని అంది. "నేను అమలాపురంలో వెంకటరామ థియేటర్ లో తొలిప్రేమ చూసా" అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అది కాదండి మీ తొలి ప్రేమ గురించి అంటూ ఆయన లైఫ్ లో జరిగిన ఇష్యూ గురించి చెప్పాలి అన్నట్టుగా అడిగింది. "ఆ సినిమాలో నుంచే నే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించడం మొదలుపెట్టా" అని చెప్పి మరో షాక్ ఇచ్చాడు విష్ణు. తర్వాత సుమ బ్లాక్ కలర్ డ్రెస్ లో దెయ్యంలా భయపెట్టాలి అనుకుంది.

"అన్నా దెయ్యం అంటే వైట్ కలర్ డ్రెస్ లో ఉండాలి ఇలా ఉన్నావేంటి" అని ప్రియదర్శి అడిగాడు. "మూడేళ్ళుగా పంజాగుట్ట నుంచి విస్పర్ వ్యాలీకి - విస్పర్ వ్యాలీ నుంచి పంజాగుట్టకు తిరుగుతుంటే బట్టలు మాసిపోవా ఏమిటి " అని అడిగింది సుమ. "ఐతే మీకు ఫస్ట్ డాక్టర్ అవసరం కాదు డ్రై క్లీనర్ అవసరం ఉంది" అని రాహుల్ రామకృష్ణ కామెడీ కౌంటర్ ఇచ్చాడు.  తర్వాత సుమ హ్యాపీ బర్త్ డేని ఈ షోకి వచ్చిన మూవీ టీమ్ అంతా కలిసి సెలెబ్రేట్ చేశారు. "ది నెస్ట్ - హోమ్ ఫర్ ఏజ్డ్" అనే అనాధాశ్రమం నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి సుమతో కేక్ కట్ చేయించి తినిపించారు. ఇక ఇందులో ఒక లేడీ సీనియర్ సిటిజన్ మాత్రం సుమని పొగిడేశారు. "మీరు ఉన్నంత వరకు మాకు ఏ లోటూ లేదసలు. మీమీదే అసలు పెట్టుకుని బతుకుతున్నాం...మాకు ఎవరూ గుర్తు రావడం లేదు. మీరే మాకు అండ" అని చెప్పింది.