English | Telugu

కొరియర్ లో డ్రగ్స్ స్కామ్స్..జాగ్రత్త ఫ్రెండ్స్

బిగ్ బాస్ కౌశల్ రీసెంట్ గా ఒక వీడియోని వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసాడు. "మీతో ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. నిన్న నాకు ముంబైలోని  ఒక కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీకొచ్చిన పార్సెల్ లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ కొరియర్ ని పోలీస్ స్టేషన్ కి పంపిస్తున్నాం. అక్కడికి వచ్చి మీ పార్సెల్ ని కలెక్ట్ చేసుకోండి.. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అన్నారు. నేను ఆ కొరియర్ మీద ఉన్న అడ్రెస్ చెప్పమని అడిగాను. వెంటనే ఫోన్ కట్ చేశారు. రీసెంట్ గా ఇలాగే బెంగుళూరు లో ఒక ముసలావిడని ట్రాప్ చేసి ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయలు లాగేసారు.

Karthika Deepam2 : శౌర్య కావాలని నోటీసులు పంపిన నరసింహా.. దీప ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(karthika depam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో....దీప హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే జ్యోత్స్న తనతో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకంటు జ్యోత్స్నకి సుమిత్ర చెప్తుంది. నీకు మా బావనే అంటే మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందని జ్యోత్స్న పూర్తిగా దీపని అపార్థం చేసుకుంటుంది. సుమిత్ర కోప్పడగా జ్యోత్స్న వెళ్ళిపోతుంది. నువ్వు నా పెద్ద కూతురు.. జ్యోత్స్న నా చిన్న కూతురు. అది ఉన్న సిచువేషన్ అర్థం చేసుకో దాని మాటలు పట్టించుకోకని దీపతో సుమిత్ర అంటుంది.    

Eto Vellipoyindhi Manasu : నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని చూశారు.. పోలీసులని ఆశ్రయించిన నమిత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -164 లో....నమిత కాన్ఫరెన్స్ రూమ్ కి సీతాకాంత్ పిలిచి.‌. నా భర్త వచ్చాడూ కానీ ఏం మారలేదు సర్ నన్ను కొట్టాడంటూ దెబ్బలు చూపిస్తుంది. వాడికి నేను బుద్ది చెప్తానని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదు సర్ నా బతుకు నేను బతుకుతాను. మీలాంటి వారి చూపు నాపైన ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చినట్లే, మీ మనసులో స్థానం ఇస్తారా అని నమిత సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో నమితని దూరంగా నెడతాడు సీతాకాంత్. నువ్వు ఇలాంటి దానివనుకోలేదు.. నా ఆఫీస్ నుండి వెళ్ళిపోమని సీతాకాంత్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : శ్రీలత మాస్టర్ ప్లాన్ అదే.. సీతాకాంత్ చుట్టూ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -163 లో.....రామలక్ష్మి ఆఫీస్ కి వచ్చిన కూడా అత్తయ్య గారు ఎదో చేయబోతున్నారంటూ ఆలోచిస్తుంది. ఏంటి పని మానేసి మరి ఆలోచిస్తున్నావంటూ సీతాకాంత్ అడుగుతాడు. అప్పుడే నమిత వచ్చి.. సర్ అంటూ ఎదో నసుగుతుంది. ఏంటి నమిత ఏదైనా మాట్లాడాలా అని సీతాకాంత్ అడుగుతాడు. మళ్ళీ వస్తాను సర్ అంటూ వెళ్లిపోతుంటే.. మీరు మాట్లాడుకోండి నేను వస్తానంటూ రామలక్ష్మి వెళ్లిపోతుంది. ఏమైంది మీ అయన గురించి తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. లేదు సర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని నమిత అంటుంది.

రీతూ చౌదరి నిమ్మకాయల గొడవ...టచ్ చేయలేదు అన్న శేఖర్ మాస్టర్

 కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ సౌండ్ తో దుమ్ము లేపుతోంది. ఐతే శేఖర్ మాష్టర్ మాత్రం ప్రియాంక మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఇందులో శ్రీముఖి ఒక కాంటెస్ట్ పెట్టింది. ఆర్జే చైతు, అంబటి అర్జున్ అలాగే లేడీస్ లో రీతూ, విష్ణు ప్రియ కలిసి ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసారు. ఇందులో ఎం చేయాలంటే  కొన్ని నిమ్మకాయలు తీసుకుని వాటిని దండలా గుచ్చి శేఖర్ మాష్టర్ కటౌట్ కి వేయాలన్నమాట. ఐతే ఆర్జే చైతు, అంబటి అర్జున్ టీమ్ వెంటనే అది కంప్లీట్ చేసేసారు. ఐతే నిమ్మకాయలు మొత్తం కలిసి దండలో 20 మాత్రమే ఉండాలి అని గర్ల్స్ కాదు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, అలా ఉండకూడదు అని గర్ల్స్ మధ్య గట్టిగానే వాదన జరిగింది. ఇక అంబటి అర్జున్ ఫుల్ సీరియస్ గా మినిమం 20 ఉండాలన్నారు.. అన్నే ఉండాలని చెప్పలేదు అన్నాడు. 19 ఉండకూడదు, అటు 21 కూడా ఉండకూడదు అని ఆర్జే చైతు - రీతూ మధ్య వార్ నడిచింది. ఇంతలో అమర్ లేచి "ఇంకొకటి పెట్టి ఉంటె గెలుస్తావురా  అని విన్నాను కానీ అయ్యో 20 పైన ఇంకొకటి పెట్టి ఓడిపోయావురా అని అనడం  ఫస్ట్ టైం వింటున్నాను" అన్నాడు. "అందుకే బ్రెయిన్ యూజ్ చేసి ఆడాలి" అని రీతూ ఫైర్ అయ్యింది.