English | Telugu
తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్.. జ్యోతక్క ఆ వీడియో వైరల్ !
Updated : Jul 31, 2024
కొందరు సెలెబ్రిటీల గురించి రెగ్యులర్ గా గాసిప్స్ అవీ వస్తుంటాయి. వాటితో సెలెబ్రిటీలు ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటారు. వాటిని కొందరు పట్టించుకోకుండా ఉంటే మరికొందరు సీరియస్ గా తీసుకుంటారు. అదే విషయాన్ని చెప్తూ జ్యోతక్క తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ ఫుల్ వ్లాగ్ చేసింది.
శివజ్యోతి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న యాంకర్. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హౌజ్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ పర్సన్ గా శివజ్యోతిని చెప్తారు. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతికి కెరీర్ మలుపు తిరిగింది. మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేనంత మంచి సక్సెస్ ఫుల్ లైఫ్ ని గడుపుతుంది శివజ్యోతి.
శివజ్యోతి( iam.savithri) కి ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తను ఏ రీల్ చేసిన మిలియన్ లో వ్యూస్ వస్తుంటాయి. ఇక తాజాగా 'తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్' అనే వ్లాగ్ చేసింది. ఇందులో మెడ్ ప్లస్ కి సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలొస్తున్నాయంటూ వచ్చిన వాటికి సమాధానాలు చెప్తూ ఆ సంస్థ ఎండీని కలిసి మాట్లాడించింది. ఈ వ్లాగ్ లో కొంత మంది రాసిన వాటిని వివరంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి వారిని నమ్మకండి. పూర్తిగా నిజానిజాలు తెలియకుండా ఏం మాట్లాడకూడదంటు శివజ్యోతి చెప్పగా ఈ వ్లాగ్ వైరల్ గా మారింది.