English | Telugu
కొరియర్ లో డ్రగ్స్ స్కామ్స్..జాగ్రత్త ఫ్రెండ్స్
Updated : Aug 2, 2024
బిగ్ బాస్ కౌశల్ రీసెంట్ గా ఒక వీడియోని వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసాడు. "మీతో ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. నిన్న నాకు ముంబైలోని ఒక కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీకొచ్చిన పార్సెల్ లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ కొరియర్ ని పోలీస్ స్టేషన్ కి పంపిస్తున్నాం. అక్కడికి వచ్చి మీ పార్సెల్ ని కలెక్ట్ చేసుకోండి.. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అన్నారు. నేను ఆ కొరియర్ మీద ఉన్న అడ్రెస్ చెప్పమని అడిగాను. వెంటనే ఫోన్ కట్ చేశారు. రీసెంట్ గా ఇలాగే బెంగుళూరు లో ఒక ముసలావిడని ట్రాప్ చేసి ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయలు లాగేసారు.
అసలు పాయింట్ ఏంటంటే కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయి అనే స్కామ్స్ చాల ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను ఫేస్ చేసాను కాబట్టి మీకు కూడా ఈ విషయాన్నీ షేర్ చేసుకోవాలని చెప్తున్నా" అంటూ "అప్రమత్తంగా ఉండండి, కొరియర్‌లో డ్రగ్స్ స్కాం సాధారణమైపోయాయి. కొరియర్ నుండి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి." అని ఒక అలెర్ట్ కాప్షన్ ని కూడా పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే తమకు కూడా ఇలా జరిగాయంటూ వాళ్ళ ఎక్స్ పీరియన్స్ ని కూడా చెప్తున్నారు. కౌశల్ ఎప్పుడూ ఏదో ఒక ఇంటరెస్టింగ్ మెసేజ్ తో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచినా కౌశల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఆఫర్స్ ఏమీ లేకపోయేసరికి సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్ డేట్స్ తో ఫాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు.