ఆ కోరిక కోసం కాదు పెళ్లి అంటే... ఇలా నీచంగా ఎవరూ మాట్లాడరు
లేడీస్ లో ట్రెండింగ్, డేర్ అండ్ డ్యాషింగ్ గా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే అనసూయ, రష్మీ, మాధవీలత, చిన్మయి శ్రీపాద. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో చేసేస్తారు అని భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. అలాంటిది ఇప్పుడు మాధవీలత సీనియర్ సిటిజన్స్ పెళ్లి గురించి మాట్లాడింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. ఐతే ఈ మధ్య కాలంలో బాగా వయసైపోయిన వాళ్ళు, పిల్లలు వదిలేసినా వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఈ విషయాన్ని బూతద్దంలో చూస్తూ ఇప్పుడు పెళ్లేంటి, ఇప్పుడు సెక్స్ ఏంటి, ఇప్పుడు పిల్లల్ని కంటారా అని వాళ్ళను బాధపెడుతున్నారు.