English | Telugu
రీతూ చౌదరి నిమ్మకాయల గొడవ...టచ్ చేయలేదు అన్న శేఖర్ మాస్టర్
Updated : Jul 31, 2024
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ సౌండ్ తో దుమ్ము లేపుతోంది. ఐతే శేఖర్ మాష్టర్ మాత్రం ప్రియాంక మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఇందులో శ్రీముఖి ఒక కాంటెస్ట్ పెట్టింది. ఆర్జే చైతు, అంబటి అర్జున్ అలాగే లేడీస్ లో రీతూ, విష్ణు ప్రియ కలిసి ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసారు. ఇందులో ఎం చేయాలంటే కొన్ని నిమ్మకాయలు తీసుకుని వాటిని దండలా గుచ్చి శేఖర్ మాష్టర్ కటౌట్ కి వేయాలన్నమాట. ఐతే ఆర్జే చైతు, అంబటి అర్జున్ టీమ్ వెంటనే అది కంప్లీట్ చేసేసారు. ఐతే నిమ్మకాయలు మొత్తం కలిసి దండలో 20 మాత్రమే ఉండాలి అని గర్ల్స్ కాదు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, అలా ఉండకూడదు అని గర్ల్స్ మధ్య గట్టిగానే వాదన జరిగింది. ఇక అంబటి అర్జున్ ఫుల్ సీరియస్ గా మినిమం 20 ఉండాలన్నారు.. అన్నే ఉండాలని చెప్పలేదు అన్నాడు. 19 ఉండకూడదు, అటు 21 కూడా ఉండకూడదు అని ఆర్జే చైతు - రీతూ మధ్య వార్ నడిచింది. ఇంతలో అమర్ లేచి "ఇంకొకటి పెట్టి ఉంటె గెలుస్తావురా అని విన్నాను కానీ అయ్యో 20 పైన ఇంకొకటి పెట్టి ఓడిపోయావురా అని అనడం ఫస్ట్ టైం వింటున్నాను" అన్నాడు. "అందుకే బ్రెయిన్ యూజ్ చేసి ఆడాలి" అని రీతూ ఫైర్ అయ్యింది.
"వెళ్లి చెయ్యి టచ్ చేయాలి అని ఇంతకు ముందు ఆడిన గేమ్ లో మరి టచ్ చేయలేదు".. అని శేఖర్ మాష్టర్ అడిగేసరికి ప్రియాంక మధ్యలో వచ్చి నిమ్మకాయల టాపిక్ గురించి మాట్లాడేసరికి "ప్రియాంక నువ్వు మాట్లాడకు ఆగు..నువ్వు మాట్లాడాలి అనుకుంటే రీతూని కానీ విష్ణుప్రియను కానీ పంపించేసి నువ్వొచ్చి మాట్లాడు" అని సీరియస్ అయ్యేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇక నెటిజన్స్ ఐతే ప్రియాంక మీద శేఖర్ మాష్టర్ ఫైర్ అవడాన్ని చాల సంతోషంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు ప్రియాంకకు అంటున్నారు.