English | Telugu

Guppedantha Manasu : ఆ మీటింగ్ లో నిజం తేలనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1141 లో.... రిషిని వసుధార హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇన్నిరోజులు బాధపడుతుంటే.. ఎందుకు మా దగ్గరకి రాలేదని వసుధార అడుగుతుంది. నేను ఎప్పుడు మీ గురించి ఆలోచించే వాడిని అని రిషి అంటాడు. అయితే ఎందుకు రాలేదని వసుధార అడుగుతుంది. అది తెలియాల్సిన టైమ్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నిన్ను అనుకోకుండా కాపాడాను అనుకుంటున్నావు కదా.. నువ్వు కష్టంలో ఉన్నావ్ కాబట్టి వచ్చానని రిషి అంటాడు.

చాల సందర్బంలో కాలేజీకి ప్రాబ్లమ్ వచ్చింది.. మీరు ఎందుకు రాలేదని వసుధార అడుగుతుంది. నువ్వు ఎలాగైనా కాలేజీ ని కాపాడతావని నాకు తెలుసని రిషి అంటాడు. ఇప్పుడు కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తుందని ఎలాగైనా కాపాడాలని వచ్చాను. మీ అన్నయ్యకి రంగా అని ఎందుకు చెప్పారు.. రిషి అని చెప్పొచ్చు కదా.. అసలు కాలేజీకి ఇలాంటి సిచువేషన్ రావడానికి కారణం తెలుసా అని వసుధార అనగానే నాకు తెలుసు అంతా తెలుసు.. నువ్వు అర్థం చేసుకోమని వసుధారకి రిషి చెప్తాడు. నేను రంగాలా ఎందుకు మారానో అన్ని త్వరలోనే తెలుస్తాయి. నేనేం చేసినా మన కోసమే అని రిషి చెప్తాడు. దాంతో రిషిని వసుధార హాగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. రేపు ఏం చెయ్యాలో అంటు వసుధారకి రిషి చెప్తాడు.

మరుసటిరోజు ఉదయం కాలేజీ మినిస్టర్ గారితో మీటింగ్ జరిగి కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్లు అందరు సంతకలు పెడుతుంటే.. రిషి వచ్చి శైలేంద్ర అన్నయ్యకి బాధ్యతలు అప్పగించండని చెప్పినట్లు శైలేంద్ర నిద్రలో కల కంటాడు. నేనే ఎండీ అని అంటుంటే.. ధరణి వచ్చి నిన్నటి వరకు కాలేజీ వెళ్లిపోతుందని బాధపడి.. ఇప్పుడు ఎండీ అంటున్నారని అంటుంది. ఆ తర్వాత మినిస్టర్ గారు మీటింగ్ అరెంజ్ చేస్తారు. ఇలా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.