English | Telugu
హరితేజ అందాల ప్రదర్శనకి నెటిజన్లు షాక్.. వైరల్ గా మారిన ఫోటోలు!
Updated : Aug 2, 2024
సోషల్ మీడియాలో తరచూ కొందరు సెలెబ్రిటీలు ఫోటోషూట్ లు చేస్తుంటారు. వాటితో ఆ రోజంతా వారే ట్రెండింగ్ లో ఉంటారు. ఇలా ట్రెండింగ్ లో తరచు ఉండేవారి లిస్ట్ పెద్దగానే ఉంది.
బిగ్ బాస్ కి వెళ్ళి బయటకొచ్చాక లేడీ కంటెస్టెంట్స్ లు తమని ఎవరు మర్చిపోకూడదని అప్పుడప్పుడు ఫోటోషూట్ లతో పేరుతో నెటిజన్లకి ట్రీట్ ఇస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇనయా సుల్తానా, అషురెడ్డి, ప్రియాంక సింగ్, అరియానా , విష్ణుప్రియ, రీతు చౌదరి, హమీదా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్ హరితేజ వచ్చేసింది. హరితేజ తాజాగా మెల్ బోర్న్‌లో అందాల ఆరబోత చేసింది. ఆమె వేసుకున్న బట్టలు, చేసిన ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. హరితేజ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.
హరితేజ ముందుగా కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు పోటెత్తాయి. ఫలితంగా 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌తో ఫుల్ పాపులర్ అయింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది.
ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం నడిపించింది. తద్వారా మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో సత్తా చాటింది. నటిగా, యాంకర్‌గా అలరిస్తోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు, ఆ ఫోటోల్లోని పోజులు మాత్రం వైరల్ అవుతున్నాయి. హరితేజకి ఇన్ స్టాగ్రామ్ లో 739K ఫాలోవర్స్ ఉన్నారు. తనకి భూమి అనే కూతురు కూడా ఉంది. ఇక అలాంటి కూతురిని ఉంచుకొని ఇలాంటి ఫోటోలేంటి అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.