English | Telugu

Eto Vellipoyindhi Manasu : శ్రీలత మాస్టర్ ప్లాన్ అదే.. సీతాకాంత్ చుట్టూ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -163 లో.....రామలక్ష్మి ఆఫీస్ కి వచ్చిన కూడా అత్తయ్య గారు ఎదో చేయబోతున్నారంటూ ఆలోచిస్తుంది. ఏంటి పని మానేసి మరి ఆలోచిస్తున్నావంటూ సీతాకాంత్ అడుగుతాడు. అప్పుడే నమిత వచ్చి.. సర్ అంటూ ఎదో నసుగుతుంది. ఏంటి నమిత ఏదైనా మాట్లాడాలా అని సీతాకాంత్ అడుగుతాడు. మళ్ళీ వస్తాను సర్ అంటూ వెళ్లిపోతుంటే.. మీరు మాట్లాడుకోండి నేను వస్తానంటూ రామలక్ష్మి వెళ్లిపోతుంది. ఏమైంది మీ అయన గురించి తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. లేదు సర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని నమిత అంటుంది.

నువ్వేం కంగారు పడకు ఈవినింగ్ వరకు చూసి.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే అందరికి తెలిసిపోతుందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే ఫైల్ మర్చిపోయానంటూ రామలక్ష్మి ఫైల్ తీసుకొని బయటకు వచ్చి నమిత ఎందుకు అలా ఉంది.. ఏం జరుగుతుంది అత్తయ్య గారు మొహం వెలిగిపోతుంది. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత నమితని సందీప్ పిలిచి ప్లాన్ త్వరగా పూర్తి చేయమని చెప్తాడు. రామలక్ష్మి ఉంటే పాసిబుల్ అవదని నమిత అనగానే.. అమ్మ చెప్తే ఏదో ఒకటి చేస్తుందని శ్రీలతకి సందీప్ కాల్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వర్క్ చేసుంటే అప్పుడే సీతాకాంత్ వచ్చి తన చెయ్యి పట్టుకొని.. అలా కాదంటూ చేస్తుంటే అప్పుడే శ్రీలత సీతాకాంత్ కి ఫోన్ చేసి.. రామలక్ష్మిని ఇంటికి పంపించు ఇంట్లో సాయంత్రం పూజ ఉందని చెప్పగానే సీతాకాంత్ సరేనంటూ రామలక్ష్మి ని పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చాక.. ఇప్పుడు పూజ ఏంటని డౌట్ పడుతుంది. వెళ్లి రెడీ అయిరా అని శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత ప్లాన్ అమలు చెయ్ అని సందీప్ నమితకి ఫోన్ చేస్తాడు. నమిత సీతాకాంత్ క్యాబిన్ కి వెళ్ళగానే అప్పుడే మాణిక్యం వస్తాడు. దాంతో కోప్పడి సీతాకాంత్ అతన్ని పంపిస్తాడు. సర్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.. కాన్ఫరెన్స్ రూమ్ కి రండి సర్ ఇక్కడ అయితే ఆ విషయం విని నన్ను తక్కువ చేసి చూస్తారని అనగానే సరే అని సీతాకాంత్ అంటాడు. నమిత లోపలికి వెళ్తుంది. సీతాకాంత్ కూడా లోపలికి వెళ్తాడు. మా ఆయన వచ్చాడు తనేం మారలేదు ఎలా హింసించాడో అంటూ దెబ్బలు చూపిస్తుంది. తనకి బుద్ది వచ్చేలా నేను చేస్తానని సీతాకాంత్ అంటాడు.. అవసరం లేదు సర్ ఇక వాడు వద్దు.. నా బ్రతుకు నేను బతుకుతాను కాకపోతే మీ లాంటి వాళ్ళు నీడగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇలా మీ చెయ్ పట్టుకొని ఏడు అడుగులు నడవాలని ఉంది. మీ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చినట్లే మీ మనసులో స్థానం ఇస్తారా సర్ ప్లీజ్ సర్ అని సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది నమిత. దాంతో హెయ్ అంటూ కోపంగా నమితని దూరం నెడతాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.