English | Telugu

Brahmamudi : బ్రహ్మముడిలో ఊహించని మలుపు.. ఆ పెళ్ళికి కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -480 లో... పెళ్లి చెడగొట్టాలని అప్పు అనుకొని కావ్యని తీసుకొని వెళ్తాడు రాజ్. కావ్య కూడా సైలెంట్ గా ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే రాజ్ కి కార్ లో ఉంది అప్పు కాదు కావ్య అని తెలుస్తుంది. ఏ మెంటల్ నువ్వు ఇందులోకి ఎలా వచ్చావని రాజ్ అడుగుతాడు. మీరు గదిలో చెప్పింది నాతోనే, మీతో పాటు వచ్చింది అప్పు కాదు.. నేనే అని కావ్య అంటుంది. ఇంకా లేట్ చెయ్యకు.. అక్కడ పెళ్లి అవుతుందని  రాజ్ కి కావ్య చెప్తుంది. దాంతో ఇద్దరు మండపానికి వెళ్తారు. మరొకవైపు కళ్యాణ్ కూడా వస్తుంటాడు.