English | Telugu

Brahmamudi : అప్పు పెళ్లికి ఏర్పాట్లు.. రాజ్ ఆ ఇద్దరిని కలపగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -477 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి పెళ్లి పత్రికతో వస్తుంది. ఇక నుండి అయిన అనామికలా నిందలు వెయ్యకుండా నా కూతురిని ఆశీర్వదించండంటూ మొదటి శుభలేక ధాన్యలక్ష్మికి ఇస్తుంది. ఆ తర్వాత ఇంటి పెద్దలకి ఇచ్చి పెళ్లికి రండి అని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ.. పెళ్లికి రావొద్దని చెప్తుంది. ఆ తర్వాత మేమ్ అంతా ఉన్అనమాని మర్చిపోకని అపర్ణ చెప్పగానే.. కనకం హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కళ్యాణ్ ని తలుచుకుని‌ అప్పు ఏడుస్తుంటే.. అప్పుడే కనకం కృష్ణమూర్తిలు వస్తారు. ఇంత రాత్రి అయిన నిద్రపట్టడం లేదా అని కనకం అనగానే.. రేపు నీ పెళ్లి ఆ తర్వాత మమ్మల్ని వదిలి వెళ్ళాల్సి వస్తుందని భాదపడుతున్నావు కదా అని కృష్ణమూర్తి అనగానే.. కృష్ణమూర్తి పైన తలవాల్చి బాధపడుతుంది. ఆడదాని జీవితమే అంత.. ఎక్కువ మాట్లాడితే వాగుడు కాయ అంటారు. తక్కువ మాట్లాడితే పొగరు అంటారు.. అంటూ అత్తరింటి గురించి కనకం చెప్తుంది. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. ఏమనుకుంటుంది మీ అమ్మ కళ్యాణ్ ని ప్రతేకంగా రావద్దని చెప్పడం ఏంటని కోప్పడతాడు. ఎందుకు అలా ఆందో మీకు తెలియదా అని కావ్య అంటుంది. నా తమ్ముడిని దారుణంగా అవమానించినట్లు అనిపించిందని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ పెళ్లి మండపం దగ్గరికి రాకుండా చేయాలి.. లేదంటే ఆ కావ్య ఏం చేసి అయిన సరే వాళ్ళ పెళ్లి చేస్తుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. కావ్య మన ముందు ఇలా చేస్తూ వెనకాల ఏదైనా ప్లాన్ చేస్తుందేమో.. ఎందుకైనా మంచిది కళ్యాణ్ పెళ్లి మండపానికి రావద్దని రుద్రాణి అనగానే.. వాడిని బెంగుళూరు పంపిస్తాను. మా ఇంటికి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి.. ఇలా బాధగా ఎందుకు ఉంటావ్.. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళమని చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాను.. ఎప్పుడైనా నాకు ఏం కావాలో ఆలోచించావా అని కళ్యాణ్ కోప్పడతాడు.. తరువాయి భాగంలో అప్పు కళ్యాణ్ ఫొటో చూసి ఏడుస్తుంటే.. స్వప్న చూస్తుంది. నువ్వు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావ్ కదా అని స్వప్న అడుగుతుంది. కళ్యాణ్ కి స్వప్న ఫోన్ చేసి అప్పు నిన్ను ప్రేమిస్తుందని చెప్తుంది. ఆ మాటలు విన్న రాజ్ ఈ కళ్యాణ్ అప్పుని నమ్ముకొని లాభం లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.