English | Telugu
Brahmamudi: ఆ ఇద్దరిని బ్రహ్మముడి ఏకం చేయనుందా!
Updated : Aug 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో....రాజ్ ఎందుకు మీ ఇంటికి వెళ్ళాడంటూ ధాన్యలక్ష్మి కావ్యని అడుగుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. వచ్చారా మీరేదో అక్కడ మా వాళ్ళతో కుట్ర చేసి ఆ ఇంటి పిల్లని ఈ ఇంటికి తెస్తున్నారని నాపై విరుచుకుపడుతున్నారు అక్కడ ఏం జరిగిందో చెప్పండని రాజ్ ని కావ్య అడుగుతుంది. అప్పు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందని రాజ్ అంటాడు. మరి మీ అత్తగారు ఏమన్నారని అపర్ణ అడుగుతుంది.
వాళ్లకు అసలు ఇష్టం లేదు.. పైగా ఆ టాపిక్ ఇక మాట్లాడొద్దంటూ నా కాళ్ళు పట్టుకోబోయిందని రాజ్ అంటాడు. ఇప్పుడు ఏం అంటారని ధాన్యలక్ష్మి తో కావ్య అంటుంది. మీరు ప్రతి దానికి కావ్యని, తన వాళ్ళని అనొద్దు.. వాళ్ళ తప్పేముంది మీరు ఇంకొకసారి వాళ్ళని అంటే నేను ఏ నిర్ణయం తీసుకుంటానో నాకు తెలియదు.. ఎవరు క్షమాభిక్ష పెట్టమని అడగొద్దని రాజ్ ధాన్యలక్ష్మి రుద్రాణి లకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇక లాభం లేదు.. అప్పు నోరు తెరిచి ప్రేమని బయటపెడితే గాని కళ్యాణ్ దైర్యం చెయ్యడు. నేనే ఏదో ఒకటి చెయ్యాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత బంటి అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అయిందని చెప్పగానే అప్పు కంగారుగా కృష్ణమూర్తికి చెప్పి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందని కనకం అడుగగా.. వాళ్ళ ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయిందని వెళ్తుందని కృష్ణమూర్తి చెప్తాడు. ఆ తర్వాత అప్పు హాస్పిటల్ కి రాగానే ఎందుకు వచ్చావ్? నీకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు కదా? నేను కళ్యాణ్ దగ్గర కి వెళ్ళనివ్వనంటూ రాజ్ తనని ఆపేస్తాడు. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను.. ప్రేమిస్తూనే ఉంటానని అప్పు అనగానే.. మరి పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావంటూ రాజ్ అడుగుతాడు. ఇప్పటికే నా వల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.. ఒకవేళ నేను కళ్యాణ్ ని చేసుకున్నా కూడా మా అక్కలు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండలేరని అప్పు అంటుంది. ఆ మాటలు చాటుగా కళ్యాణ్ వింటాడు. కళ్యాణ్ కి ఏం కాలేదు నీ ప్రేమ విషయం బయట పెట్టాలని చేశానని రాజ్ అంటాడు.అప్పు వెళ్ళిపోయాక కళ్యాణ్ రాజ్ దగ్గరికి వస్తాడు. చూసావ్ కదా ఏం చేస్తావో నీ ఇష్టం అని రాజ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్, కళ్యాణ్ లు ఎక్కడికి వెళ్లారంటు కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుడే రాజ్, కళ్యాణ్ లు వస్తారు. ఎక్కడికి వెళ్ళావ్ రా అని కళ్అయణ్ ని ధాన్యలక్ష్మి అడుగగా.. నీకెందుకు చెప్పాలని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కనకం శుభలేక తీసుకొని వచ్చి.. ధాన్యలక్ష్మికి ఇస్తుంది. ఇప్పటికైనా అపార్ధం చేసుకోకుండా ఉండండని చెప్తుంది. తరువాయి భాగంలో అప్పు వెడ్డింగ్ కార్డు పట్టుకొని కళ్యాణ్ బాధపడుతుంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వచ్చి వాళ్ళని విడదీస్తున్నావ్.. వాళ్ళు జీవితాంతం బాధపాడాల్సి వస్తుందని రాజ్ అంటాడు. వాళ్ళని నేను విడదీయడం లేదని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.