English | Telugu
తన్మయ్ రూమ్‌లో కృష్ణ భగవాన్... వీడియో వైరల్!
Updated : Jul 31, 2024
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో తన్మయ్ కి కృష్ణ భగవాన్ కి మధ్య ఉన్న లింక్ గురించి నూకరాజు రివీల్ చేసేసాడు. "సర్ ఈ వాచ్ మీదే అనుకుంటా" అని నూకరాజు ఒక వాచ్ ని తీసుకొచ్చి కృష్ణ భగవాన్ కి ఇచ్చి చూపించాడు. "నాదే కానీ నీకెక్కడిది" అని అడిగారు కృష్ణ భగవాన్. "తన్మయ్ రూమ్ లో దొరికింది" అని నూకరాజు చెప్పేసరికి కృష్ణ భగవాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మాములుగా లేవు.
నిజం బయట పడిపోయిందే ఇలా స్టేజి మీద అందరి ముందు అన్నట్టుగా పెట్టారు. "మీ చేతికి ఉన్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సర్" అని మరో డైలాగ్ వేసాడు నూకరాజు. " ఇది ఎవరిదీ" అని డౌట్ గా అసలు ఎవరి వాచీనో కూడా చూడకుండా పెట్టుకొచ్చేసి. "అది తన్మయ్ ది సర్ కంగారులో మీరు పెట్టుకొచ్చేశారు" అన్నాడు నూకరాజు. "తన్మయ్ ది కూడా (వాసిపోయిందా) వాచ్ పోయిందా" అని తన చేతి వాచ్ ని తీసి నూకరాజుకు ఇచ్చేసారు కృష్ణ భగవాన్ .. ఇక ఆ సీన్ కి ఇటు రష్మీ, అటు ఖుష్బూ తెగ నవ్వుకున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ ఖుష్బూ మీద కౌంటర్ వేసాడు నూకరాజు. "అయ్యో పిచ్చి తల్లి ఎగ్జాం ఒకేసారి రాసుకుంటది స్కిట్లు ఒకేరోజు చూస్తాది...అమ్మా మీకు దణ్ణం పెడతానమ్మా.. రాయొద్దమ్మ..ఎందుకంటే మీరు పేలని పంచ్ రాసే గ్యాప్ లో పేలే పంచులు మూడెల్లిపోతున్నాయి.." అని పంచ్ పేల్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.