English | Telugu

బంఢారం బయటపెట్టేసిన రామలక్ష్మి... సందీప్ కి వార్నింగ్ ఇచ్చిన సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -159 లో.. మీరు ఇన్ని రోజులు సీతా సర్ కి పెళ్లి ఎందుకు చేయలేదని శ్రీలతని అడుగుతుంది రామలక్ష్మి. నేను ఎప్పుడు వాడికి పెళ్లి చేస్తాను అన్నాను.. నిన్ను కూడా వారసుడిని ఇప్పుడిస్తావని అడిగాను.. నువ్వు సమాధానం చెప్పలేదు. ఇప్పుడూ చెప్పు వారసుడిని ఎప్పుడు ఇస్తావని శ్రీలత అడుగుతుంది. మాకు ఈ మధ్య పెళ్లి అయింది.. ఎప్పుడో పెళ్లి అయిన శ్రీవల్లి, సందీప్ లని వదిలేసి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని రామలక్ష్మి అంటుంది.

Brahmamudi : ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి.. నిలదీసి‌న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -472 లో.. ధాన్యలక్ష్మి సాంగ్స్ వింటుంటే.. అప్పుడే తన దగ్గరకి రుద్రాణి వస్తుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కళ్యాణ్ గురించి అన్నీ చెప్పాను కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పిందని రుద్రాణి అనగానే.. ఇప్పుడు కళ్యాణ్ కి పెళ్లి ఏంటి విడాకులు అయి రెండు రోజులే అయింది. ఇంకా వాడు సెట్ అవ్వలేదని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు.. కరెక్ట్ టైమ్ అనుకొని కళ్యాణ్ కి మాయమాటలు చెప్పి అప్పుని ఇచ్చి పెళ్లి చేస్తోందని రుద్రాణి అంటుంది.

Karthika Deepam2 : అల్లాడించిన కార్తిక్ బాబు.. దిమ్మతిరిగే షాక్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.....కార్తీక్ నా జీవితానికి సంబంధించిన విషయం చెప్పాలని అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఈ విషయం చెప్పేటప్పుడు అందరు ఉండాలి దీప కూడా ఉండాలి అనగానే శౌర్య వెళ్లి దీపని తీసుకొని వస్తుంది. ఏంటి బాబు పిలిచారట అని దీప అడుగుతుంది. చెప్తానని కార్తీక్ అంటాడు. ఏం చెప్తాడోనని అందరు టెన్షన్ పడతారు. ఆల్రెడీ పెళ్లి అయిన నా  జీవితం గురించి చెప్తానని అనగానే.. అందరు షాక్ అవుతారు. డౌట్ లేదు దీప పేరు చెప్తాడని జ్యోత్స్న వెనకాల నుండి కత్తి రెడీగా పెట్టుకుంటుంది. అది చూసి పారిజాతం టెన్షన్ పడుతుంది.

Eto Vellipoyindhi Manasu : తమ్ముడిని గొప్పగా పొగిడి‌న అన్నయ్య.. ఆ నిజం కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -158 లో.. సీతాకాంత్ మీటింగ్ లో సందీప్ ని మెచ్చుకుంటాడు. ఇంత తక్కువ టైమ్ లో కంపెనీ ని కావలసిన ల్యాండ్ రెడీ చేసావ్.. నువ్వు నా తమ్ముడు అయినందుకు గర్వంగా ఉందంటూ గొప్పగా పొగుడుతాడు. ఆ డాకుమెంట్స్ చూసారా అని రామలక్ష్మి అడుగగా.. చూసానని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే వైస్ చైర్మన్ ని చేస్తానని అనగానే సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదో చేస్తున్నాడు ముందు.. అది కనుక్కోవాలని రామలక్ష్మి అనుకుంటుంది.