English | Telugu

Karthika Deepam2 : శౌర్య కావాలని నోటీసులు పంపిన నరసింహా.. దీప ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(karthika depam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో....దీప హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే జ్యోత్స్న తనతో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకంటు జ్యోత్స్నకి సుమిత్ర చెప్తుంది. నీకు మా బావనే అంటే మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందని జ్యోత్స్న పూర్తిగా దీపని అపార్థం చేసుకుంటుంది. సుమిత్ర కోప్పడగా జ్యోత్స్న వెళ్ళిపోతుంది. నువ్వు నా పెద్ద కూతురు.. జ్యోత్స్న నా చిన్న కూతురు. అది ఉన్న సిచువేషన్ అర్థం చేసుకో దాని మాటలు పట్టించుకోకని దీపతో సుమిత్ర అంటుంది.

మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్ళగానే శ్రీధర్ తనపై కోప్పడతాడు. మీ అమ్మ కళ్ళు తిరిగిపడిపోయింది ఫోన్ చేశా అయిన పట్టించుకోలేదు. నీకు ఆ పాప అంత ఎక్కువ అయిందా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాపైన మీకు నమ్మకం లేదా ఉంటే ఇలా చెయ్యరు.. మీకు తల వంపులు తెచ్చే పని ఎప్పుడు నేను చెయ్యనంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఏంటి అండి మీరు ఆలా మాట్లాడారు.. వాడు భోజనం చేసాడో లేదో అని కాంచన కార్తీక్ వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత నరసింహా కోర్టు ద్వారా శౌర్యని తెచ్చుకోవాలని అనసూయకి చెప్తాడు. అలా వద్దని అనసూయ చెప్పినా కూడా నరసింహా లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత నరసింహ లాయర్ దగ్గరికి వెళ్లి నా భార్య వేరొకడితో సంబంధం పెట్టుకొని నా కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదు.. అందుకే నా కూతురు నాకు కావాలని లాయర్ కి చెప్తాడు నరసింహా. లాయర్ సరే డబ్బులు రెడీ చేసుకోమని చెప్తాడు. అలాగే నువ్వు గెలిచేలా సాక్ష్యం రెడీ చేసుకోమని చెప్తాడు. సాక్ష్యం అంటే దీప, కార్తీక్ లకి సంబంధం ఉన్నట్లు నిరూపించాలా అని నరసింహ అనుకుంటాడు. మరొకవైపు దీపకి కోర్టు నుండి నరసింహ పంపిన నోటీసులు వస్తాయ్.‌ అవి ఏంటి అర్ధం కాక దీప సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న మనసు అత్తయ్య పూర్తిగా పాడుచేస్తుంది వెంటనే అత్తయ్యని ఇక్కడ నుండి పంపాలని దశరత్ తో సుమిత్ర అంటుంది. జ్యోత్స్న తో నెగటివ్ గా మాట్లాడుతున్న పారిజాతం దగ్గరికి సుమిత్ర, దశరత్ లు వస్తారు.

పిన్ని మీరు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అప్పుడే దీప నోటీసులు తీసుకోని వచ్చి ఇవేంటి అంటూ సుమిత్రకి చూపిస్తుంది. శౌర్య కావాలని నరసింహా నోటీసులు పంపాడని సుమిత్ర చెప్తుంది. అప్పుడు కూడా పారిజాతం దీప బాధపడేలా మాట్లాడుతుంది. నా కూతురు నా నుండి దూరం కాకుండా చుడండి అని సుమిత్ర, దశరత్ ల కాళ్ళు పట్టుకుంటుంది దీప. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.. నువ్వు కంగారుపడకంటు ఇద్దరు దీపకి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.