English | Telugu

Karthika Deepam2 : దీపని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన సుమిత్ర.. జ్యోత్స్న  ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -111 లో......సుమిత్ర వాళ్ళు భోజనం చేస్తుంటారు. కనీసం మమ్మల్ని పిల్వకుండానే తింటున్నారా వాళ్లకి ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది అన్న బాధ కొంచెం కూడా లేదని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ సుమిత్ర కి ఫోన్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు‌. నువ్వు త్వరగా రాకుంటే మళ్ళీ దీప ఎక్కడికైనా వెళ్ళిపోతుందని కార్తీక్ అనగానే.. సుమిత్ర బయలుదేరుతుంటుంది‌. జ్యోత్స్న తినే ప్లేట్ కిందకి విసిరేస్తుంది.

ఏంటి జ్యోత్స్న ఏం చేస్తున్నావని సుమిత్ర అడుగగా.. ఎవరికి అయిన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందన్న బాధ ఉందా.. అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. నేను అసలు తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు.. ఆ దీప కోసం తినే ప్లేట్ లో కడుక్కుని వెళ్ళిపోతున్నావని జ్యోత్స్న అంటుంది. నీ ప్రేమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే చూపించు అమ్మ అని జ్యోత్స్న అంటుంది. దీప పైన నాకుంది జాలి అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న అర్థం చేసుకుండ తిడుతుంది. నువ్వు భాదపడుతున్నావ్ కరెక్ట్ కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదు అన్నం ఎవరైనా అలా చేస్తారా అని జ్యోత్స్న శివన్నారాయణ అంటాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ముందు నువ్వు హాస్పిటల్ కి వెళ్లు.. జ్యోత్స్న తో నేను మాట్లాడుతానంటూ దశరత్ అనగానే సుమిత్ర వెళ్తుంది. దీప కష్టంలో ఉన్నప్పుడు మనం చూడకుండా ఉంటే ఎలా అని శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత సుమిత్ర హాస్పిటల్ కి వెళ్తుంది. నువ్వు వెళ్లి తిని రెస్ట్ తీసుకోమని సుమిత్ర అంటుంది. నీ కూతురు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయినందుకు కోపంగా లేదా అని సుమిత్రని అడుగుతాడు కార్తిక్‌. ఎందుకు కోపం ఒక పాప ప్రాణాలు కాపాడావ్.. తల్లి, బిడ్డ విడిపోకుండా చేసావని సుమిత్ర అనగానే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపటికి అక్కడ నుండి కార్తిక్ వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత డాక్టర్ డిశ్చార్జ్ చేశారు వెళ్లిపొమ్మన్నారు పదండి అంటూ సుమిత్ర అనగానే.. నేను రాను అని దీప అంటుంది. దాంతో సుమిత్ర తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఏదో రకంగా మాటలు అంటూనే ఉంటుంది. జ్యోత్స్న ఇప్పటికే చాలా ఎక్కువ అయింది వెళ్ళు అంటూ సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.