యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!
సరిపోదా శనివారం ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ రష్మీ పరువును నిలువెల్లా తీసేసాడు. అసలు పాపం రష్మీ ఏదో హీరోయిన్ గా అడిగింది అంటే భాస్కర్ మరీ అంత మాట అనేయాలా. "భాస్కర్ కొత్త సినిమా చేస్తున్నావ్ కదా అందులో నన్ను హీరోయిన్ గా" అని ఇంకా తన మాట పూర్తి చేయకుండానే భాస్కర్ ఫైర్ ఐపోయాడు. "ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు..మీవన్నీ బుల్లితెర ఫేస్ లు. నాది వెండి తెర ఫేస్. ఆల్రెడీ మీ ఫామిలీ వారంలో మూడు రోజులు ఈటీవీ మీద పడి మేస్తున్నారుగా ఇంకా సరిపోలేదా..ఒక పని చేస్తా,,ఉదయం పూట అమ్మకు శుభమస్తు ప్రోగ్రాం ఇప్పిస్తా జాతకాలు చెప్పుకోమను..తమ్ముడికి ఈటీవీ న్యూస్ ఇప్పిస్తా..రోజూ కనిపిస్తాడు. నువ్వు మిగతా మూడు రోజులూ సీరియల్స్ చేసుకో. వెండితెర మీద వెలగాలంటే నా లాంటి క్రేజ్ ఉండాలి, నా అంత గ్లామర్ ఉండాలి. నీ ఫేస్ వెండితెరకు సరిపోదురా.." అని భాస్కర్ నానా మాటలు అనేశాడు. దానికి రష్మీ పాపం ఫీలయ్యింది.