English | Telugu

Eto Vellipoyindhi Manasu : నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని చూశారు.. పోలీసులని ఆశ్రయించిన నమిత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -164 లో....నమిత కాన్ఫరెన్స్ రూమ్ కి సీతాకాంత్ పిలిచి.‌. నా భర్త వచ్చాడూ కానీ ఏం మారలేదు సర్ నన్ను కొట్టాడంటూ దెబ్బలు చూపిస్తుంది. వాడికి నేను బుద్ది చెప్తానని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదు సర్ నా బతుకు నేను బతుకుతాను. మీలాంటి వారి చూపు నాపైన ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చినట్లే, మీ మనసులో స్థానం ఇస్తారా అని నమిత సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో నమితని దూరంగా నెడతాడు సీతాకాంత్. నువ్వు ఇలాంటి దానివనుకోలేదు.. నా ఆఫీస్ నుండి వెళ్ళిపోమని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత నమిత తన డ్రెస్ చింపుకొని నన్నేం చెయ్యొద్దు సర్ అంటూ అరుస్తుంటే.. అందరు వస్తారు. సర్ నాపై ఇష్టంతో ఇక్కడికి రప్పించుకున్నారు.. నన్ను బలవంతం చెయ్యబోయారని నమిత చెప్తుంది. తను చెప్పేది అబద్ధం.. నా భర్త తనని టార్చర్ చేస్తున్నాడంటే నేను నీ భర్తతో మాట్లాడుతా అన్నానని సీతాకాంత్ అంటాడు. నమితకి పెళ్లి కాలేదు.. అయిన ఒక ఆడపిల్ల అలా చెప్పుకోదు.. ఇంట్లో భార్యని పెట్టుకొని ఇదేం పని అని సందీప్ అంటాడు. మా బాస్ అలాంటివాడు కాదని ఎంప్లాయిస్ అంటారు. నన్ను ఇలా టార్చర్ చేసినందుకు మీకు బుద్ది వచ్చేలా చేస్తానంటూ నమిత వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంట్లో పూజ చేస్తుంటారు. ఆ తర్వాత సందీప్ ఇంటికి వచ్చి శ్రీలతకి సైగ చెయ్యగానే పక్కకి వెళ్తుంది. మన ప్లాన్ సక్సెస్ అంటూ సందీప్ అనగానే శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. సీతాకాంత్ డల్ గా ఇంటికి వస్తాడు. ఏమైంది అలా ఉన్నారని రామలక్ష్మి అడుగుతుంది. వర్క్ చేసి అలసిపోయాడని శ్రీలత అంటుంది. రామలక్ష్మికి బొట్టు పెట్టమని శ్రీలత అనగానే సీతాకాంత్ బొట్టు పెడుతుంటే.. అప్పుడే పోలీసులు వస్తారు. ఏంటి ఇలా వచ్చారని అడుగగా.. మిమ్మల్ని అరెస్ట్ చెయ్యడానికి అని పోలీసులు చెప్తారు. అయన ఏం తప్పు చేసారని అరెస్ట్ చేస్తారని రామలక్ష్మి అంటుంది. అప్పుడే నమిత వచ్చి నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని ట్రై చేశారు.. నా జీవితం నాశనం చెయ్యాలని ట్రై చేశారని నమిత అనగానే.. అబద్ధమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.