English | Telugu

ఆ తల్లీ కొడుకులు మళ్ళీ స్క్రీన్ మీదకు..ఖుషీలో ఫాన్స్

జానకి కలగనలేదు సీరియల్ లో అలనాటి అందాల నటి రాశి నటించిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు అమరదీప్ చౌదరి, కోడలిగా ప్రియాంక జైన్ నటించారు. ఐతే అమరదీప్ - రాశి బాండింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. రియల్ మదర్ అండ్ సన్ లా కనిపిస్తారు. ఐతే వీళ్ళు కలిసి ఒక షోలో కనిపించబోతున్నారు. ఆ పిక్స్ ని అమరదీప్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మళ్ళీ ఇంకోసారి మా అమ్మతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాను..థ్యాంక్యూ సో మచ్ అమ్మా..నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు పాజిటివ్ ఎనెర్జీ వచ్చేస్తుంది..ఎప్పటికీ మా అమ్మ నా లైఫ్ లో నా వెన్నెముకలా నిలబడుతుంది" అని పోస్ట్ చేసాడు.​    

ఎప్పటికి మారతార్రా మీరంతా ?

ఆట సందీప్‌ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్‌ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళ డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు జ్యోతి రాజ్‌ షేర్‌ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది ఇళ్లల్లో చూస్తే ఆడవాళ్లు ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఉద్యోగం, హాబీస్ అన్నిట్లో ఉంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు, బయట మగవాళ్ళు చాలా చులకనగా చూస్తారు. వన్స్ పెళ్ళై పిల్లలు పుట్టారు అంటే ఆ మదర్స్ కి బాడీ వచ్చేస్తూ ఉంటుంది.

Brahmamudi : పెళ్ళికి రెడీగా లేను.. అప్పు మనసులో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో... కళ్యాణ్ ని కావ్య పిలిచి అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన నీకు అప్పుపైన ప్రేమ ఏంటి? మీది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే.. అదే విషయం మీ అన్నయ్య నమ్మడం లేదు.. మీరు అప్పుని ప్రేమిస్తున్నారని ఆయన నాతో వాదిస్తున్నారని కావ్య అంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. అప్పు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా అంతే అని కళ్యాణ్ అనగానే కావ్య రిలాక్స్ అవుతుంది. అయితే మీరు నాకూ ఇంకొక మాట కూడా ఇవ్వాలని కావ్య అనగానే ఏంటి పెళ్లి కి నేను రావద్దని చెప్తారా అని కళ్యాణ్ అంటాడు.

కెమెరా ముందు అలా హగ్ చేసుకున్న నమిత!

  ​స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -161 లో... సీతాకాంత్ ని రామలక్ష్మి ప్రేమగా చూస్తుంటే అప్పుడే కాఫీ పట్టుకొని మాణిక్యం వస్తాడు. కరెక్ట్ టైమ్ కి వస్తావని అతని పైన సీతాకాంత్ చిరాకు పడతాడు. రామలక్ష్మి నవ్వుకుంటుంది. అసలిప్పుడు నేనేం చేసానని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత సర్ మీతో కలిసి బయటకు వెళ్లి చాలా రోజులు అవుతుంది.. సరదాగా అలా వెళదామా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు రామలక్ష్మి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీతకాంత్ చెప్తాడు. దాంతో రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది.

Guppedantha Manasu : వసుధారకి షాకిచ్చిన రిషి.. శైలేంద్రకి  నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1139 లో.. వసుధారకి రంగా ఇచ్చిన గిఫ్ట్ ఇస్తుంది రాధమ్మ. అది చూసిన వసుధార.. అసలు ఇందులో ఏముందని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. అందులో రంగానే రిషి అని చెప్పే జ్ఞాపకాలు ఉంటాయి. వసుధార, రిషి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చుకున్న గిఫ్ట్ లు ఉంటాయి. అవి చూసిన వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే రిషి సర్ ఆని నాకు తెలుసంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతకీ సర్ ఎక్కడికి వెళ్లారని వసుధార అనుకుంటుంది. మరోవైపు రిషిగా నటించడం కోసం శైలేంద్రతో రంగా వెళ్తాడు.

నాకూ ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తోంది

త్వరలో ఫ్రెండ్ షిప్ డే రాబోతోంది. ఇక ఈ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ ఐపోయింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఇందులో ఆది కనిపించలేదు. కానీ పంచ్ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత కనిపించాడు. ఇక ప్రసాద్ రాగానే ఇంద్రజ డైలాగ్ వేసింది " ప్రసాద్ గారు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా" అనేసరికి "మళ్ళీ రవ్వొద్దు" అనా అండి అని ప్రసాద్ పంచ్ వేసాడు. దానికి ఇంద్రజ పెట్టింగ్ ఫేస్ మాములుగా లేదు. ఇక ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏమిటి అని ఇంద్రజ అడిగేసరికి "తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవారు ఫ్రెండ్, పీకల్దాకా తాగించేవాడు బెస్ట్ ఫ్రెండ్" అంటూ ఒక నాటీ అర్ధం చెప్పాడు నాటీ నరేష్. తర్వాత ఆదర్శ్, అన్షు కలిసి "నీ స్నేహం" మూవీలోంచి ఫ్రెండ్ షిప్ సాంగ్ కి చాలా క్యూట్ గా డాన్స్ చేసారు.

రాహుల్ ఆల్ఫా మేల్ ... కానీ మీ అందరిలా టాక్సిక్ ఆల్ఫా మేల్ కాదు

చిన్మయి శ్రీపాద ఏదైనా కుండ బద్దలు కొట్టేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్.  మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ అందరి గుండెల్లో దడ పుట్టించిన చిన్మయి మాట్లాడే మాటలు వింటే ఇలాంటి అమ్మాయిని భరిస్తూ ఆ రాహుల్ ఎలా ఉంటున్నాడురా బాబు అనుకోకుండా ఉండరు. ఇప్పుడు అదే జరిగింది. చిన్మయి రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. "తండ్రి కూతుళ్ళ రిలేషన్ లో తప్పులు వెతుకుతున్నారు అని అందరూ నన్ను అంటున్నారు కానీ నేను అది కాదు చెప్పింది నా హజ్బెండ్ రాహుల్ కి. కొంతమంది మీమర్స్ కి అసలు ఎప్పుడూ నా గురించే ఆలోచన.. అసలు ఆ రాహుల్ నాతో ఎలా బతుకుతున్నాడా, ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడా  అన్నదే అల్లాలోచిస్తూ ఉంటారు. దీన్ని వదిలేసి వెళ్ళిపో మావా...డివోర్స్ ఇచ్చేయ్ మామ అని అరుస్తూ, వాగుతూ కూర్చుంటారు.