English | Telugu
Guppedantha Manasu : రిషి ఎంట్రీ మాములుగా లేదుగా.. షాకైన శైలేంద్ర!
Updated : Aug 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1142 లో...మినిస్టర్ గారు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీరు ఎండీగా ఉండడానికి ఎవరు ఇష్టం గా లేరు.. ఇక వేరే ఆప్షన్ లేక ఇలా చెయ్యాల్సి వస్తుందని మినిస్టర్ అంటాడు. వేరే ఆప్షన్ ఎందుకు లేదు శైలేంద్రని చెయ్యొచ్చు కదా అని దేవయాని అంటుంది. అదే విషయం ముందే చెప్పాను.. శైలంద్రని చెయ్యమని రిషి గాని వసుధార గాని వచ్చి చెప్పాలని మినిస్టర్ అంటాడు.
ఆ తర్వాత అందరు సంతకాలు పెడుతుంటారు. శైలంద్ర మాత్రం ఇంకా రంగా రావట్లేదని ఫోన్ చేస్తుంటే అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏంటి వీడూ టైమ్ కి హ్యాండ్ ఇచ్చాడా ఏంటని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర సంతకం పెడుతుండగా వసుధార వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. దెయ్యం అంటూ వసుధారని చూసి శైలేంద్ర భయపడుతుంటే.. అందరు ఏమైందంటూ అడుగుతారు. వసుధార చనిపోలేదు బ్రతికే ఉంది సైలెంట్ గా ఉండమని శైలేంద్రకి దేవయాని చెప్తుంది. అమ్మ వసుధార వచ్చావా.. నువ్వు వచ్చావంటే మరి రిషి అని మహేంద్ర అడుగుతాడు. వచ్చారు మావయ్య అని వసుధార చెప్తుంది. మరొకవైపు రిషి ఏంట్రి మాములుగా ఉండదు.. తను వస్తుంటే స్టూడెంట్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతూ పూలు చల్లతుంటారు. మహేంద్రతో పాటు అందరు రిషికి ఎదరు గా వెళ్తారు. అందరూ రిషిని చూసి షాక్ అవుతారు. అచ్చం రిషి లాగే ఉన్నాడని శైలేంద్ర అనుకుంటాడు.
రిషిని వెళ్లి హగ్ చేసుకుంటాడు మహేంద్ర. చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రిషి అందరిని పలకరిస్తాడు. నువ్వు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇక ఈ కాలేజీని అంత రిషి చూసుకుంటాడని మినిస్టర్ అంటాడు.అదంతా చూస్తున్న శైలేంద్ర స్పృహ తప్పి కిందపడిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర స్పృహలో నుండి బయటకు వచ్చి.. నువ్వు రిషివి కదా అని అంటాడు. నేను రంగాని.. ఆవిడ ఎవరో నేను కాలేజీ లోపలికి వస్తుంటే ఆపి.. రిషి సర్ అంటూ అదంతా ప్లాన్ చేసిందని చెప్తాడు. సరే నేను చెప్పినట్టు చేస్తూ ఉండు అని రంగాకి శైలేంద్ర చెప్తాడు. సరే కానీ ఆ మేడమ్ కి భర్తగా నటించలేనని రంగా అంటాడు. అలా చేయకుంటే డౌట్ వస్తుందని శైలేంద్ర అంటాడు. అప్పుడే అందరు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.