English | Telugu
రేవ్ పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్
Updated : Jul 31, 2024
బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో జరిగిన ఒక రేవ్ పార్టీలో మెహబూబ్ దొరికినట్లు తెలుస్తోంది. మహబూబ్ బర్త్‌డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వ్హయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పార్టీలో బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు పార్టీలో పాల్గొన్నారని తెలుస్తోంది. అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు ఈ రిసార్ట్ పై దాడులు చేసి మెహబూబ్ షేక్‌పై కేసు నమోదు చేశారు. అలాగే ఆయన తోపాటు పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇటీవలి కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతుంది. సినీ . కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ వేడి ఇంకా చల్లారక ముంది హైదరాబాద్ రేవ్ పార్టీ కలకలం సృష్టిస్తోంది.