English | Telugu

బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీనా...ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రోవర్సి పక్కా గ్యారెంటీ

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో రాబోతోంది. దానికి సంబందించిన ఒక లోగో కూడా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ 8 సింబల్ చూసి రెండు ఇల్లు ఉంటాయేమో ఈ కొత్త సీజన్ లో అనే డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు చాల మంది.  ఐతే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ని అప్ డేట్ చేస్తుకుంటూ వెళ్తున్నారు బిగ్ బాస్ టీమ్.  ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ పేర్లు చూస్తే షో వేణుస్వామి, బర్రెలక్క, కుమారీ ఆంటీ, తేజశ్విని గౌడ, వైష్ణవి పిస్సే, బంచిక్ బబ్లూ, సాకేత్, శ్వేతా నాయుడు, యాదమరాజు, మై విలేజ్ షో అనీల్, నిఖిల్, అక్షిత, సోనియా సింగ్, ఖయూమ్, రేఖా భోజ్ వంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే శివాజీ పేరు కూడా మళ్ళీ వినిపిస్తోంది.

నా ఎజ్ 24 మాత్రమే.. సిద్ధూ.. వద్దమ్మా వద్దు

ఈ వారం కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఎపిసోడ్ ప్రోమో సూపరో సూపర్ లా ఉంది. అమ్మాయిలైతే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల్లా అందంగా మెరిసిపోయారు. ఐతే ఇందులో బ్రహ్మముడి కావ్య చేసిన అల్లరి ఎప్పటిలాగే ముద్దుగా క్యూట్ గా ఉంది. అల్లరి క్యూట్ గా ఉంటే ఉంది కానీ శేఖర్ మాష్టర్ ని కూడా పటాయించేసింది ఈ వారం ఈ అల్లరి పిల్ల. బొమ్మరిల్లు మూవీలో జెనీలియా రోల్ కనిపించి అందరినీ మెస్మోరైజ్ చేసేసింది. జెనీలియా వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొచ్చి స్టేజి మీద గంతులేసింది. శ్రీముఖి అడిగింది "నీ పేరేమిటి" అనేసరికి "హహ హాసిని" అంటూ నవ్వుతూ చెప్పింది కావ్య. "సరే నీ సిద్దు ఎక్కడా" అని అడిగింది శ్రీముఖి.

Eto Vellipoyindhi Manasu : కూపీలాగుతున్న రామలక్ష్మి.. ఆ నిజం కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -157 లో... రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని వచ్చి.. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది. ఆడ్ ఏజెన్సీకి ఇవ్వాల్సిన నా కాన్సెప్ట్ అనగానే.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. నువ్వు ఇచ్చిన ఐడియాతో ఇలా కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ రింగ్ తీసుకోమని సీతాకాంత్ అనగానే.. నాకేం వద్దు మీ రింగ్ అని రామలక్ష్మి కోపంగా పక్కకి వెళ్తుంది. కాన్సెప్ట్ మాత్రం ఆడ్ వాళ్ళకి కానీ నిజంగానే నా ప్రేమ నీకు చెప్పాను రామలక్ష్మి.. ఈ రింగ్ ఇచ్చి నా మనసులో మాట నీకు చెప్తానని సీతాకాంత్ అనుకుంటాడు.

Guppedantha Manasu : రంగానే రిషినా.. బుజ్జి మనసులో మాట చెప్పేసిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1135 లో... శైలేంద్రని రంగా తీసుకొని సరోజ ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడే దారిలో రంగాని పలకరిస్తూ వెళ్తుంటారు. వాళ్ళ మాటల్లో రంగానే అతను రిషి కాదని క్లారిటీకి వస్తాడు. బుజ్జి ఆటో తీసుకొని వస్తాడు. సర్ అందులో సరోజ ఇంటికి వెళదాం.. ఇక్కడ పక్కనే అని రంగా అనగానే అవసరం లేదని శైలేంద్ర అంటాడు. వెళదామన్నారు ఏదో అడగాలన్నారు అని రంగా అనగానే..  ఏం లేదు నాకు నువ్వు రంగావి మంచివాడివి అన్న నమ్మకం వచ్చింది. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని చెప్పండి అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వసుధార ఫోటో రంగాకి బుజ్జికి చూపించి ఈవిడ మీకు తెలుసా అని అడుగుతాడు. చెప్పొద్దంటూ బుజ్జికి రంగా సైగ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తెలియదంటారు. దాంతో శైలేంద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు.

Karthika Deepam2 : వంటలక్కకి దిమ్మతిరిగే షాక్..  ఆ నిజం తెలుసుకున్న కార్తిక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. కార్తీక్ తో మాట్లాడింది దీప గుర్తుకుచేసుకుంటుంది. ఈ కార్తీక్ బాబు‌‌.. ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు భయంగా ఉందని దీప అనుకుంటుంది‌. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని దీపతో కార్తీక్ అంటాడు‌. ఇంట్లో శౌర్య ఉందా అని కార్తీక్ అడుగుతుంది. లేదు సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళిందని దీప చెప్తుంది. మంచి పని చేసిందని కార్తీక్ అంటాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు.. ఏంటని దీప అడుగుతుంది. స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు కదా ఇప్పుడు స్వప్న ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. ఏం అంటావని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది.