English | Telugu

ఫిట్‌నెస్ జర్నీకి ఏడాది పూర్తి

బ్రహ్మముడి మానస్ ఈ మధ్య బాడీని ఫిట్ గా ఉంచుకునే పనిలో ఉన్నాడు. అటు సీరియల్స్ ఇటు మూవీస్ లో, బుల్లితెర ఈవెంట్స్ లో, షోస్ లో నటిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు మానస్ ఇంటి పేరుగా మారిపోయింది. పాయల్ రాజపుట్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన మూవీ "రక్షణ" లో ఒక నెగటివ్ రోల్ లో అద్భుతంగా నటించాడు. అలాంటి మానస్ లాస్ట్ ఇయర్ పిక్ ని ఈ ఇయర్ పిక్ ని పెట్టి తన ఫిట్నెస్ జర్నీ గురించి ఒక పోస్ట్ పెట్టాడు. "నా ఈ ఫిట్‌నెస్ ప్రయాణంలో ఒక మైలురాయిని దాటాను. ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి ఏడాది పూర్తయ్యింది.

ఒక ఏడాది గట్టిగా ట్రై చేస్తే ఇలాంటి శరీరం సాధించాను. ఆ జర్నీని మీతో షేర్ చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. లాస్ట్ ఇయర్ నేను హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసాను. పోషక ఆహరం తినడం..తప్పనిసరిగా వ్యాయామం చేయడం వంటివి స్టార్ట్ చేశాను. భుజం, మణికట్టు గాయాలు ఉన్నా కూడా నేను కష్టపడి ఇలాంటి అందమైన శరీరాన్ని సాధించుకోగలిగాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నేను జర్నీని స్టాప్ చేయలేదు. ఈ ఏడాది మొత్తం నాకు సపోర్ట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కోచ్ కి , నా డైటీషియన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. నా శరీరానికి అవసరమైన వ్యాయామం ఎలా చేయాలో చెప్పి ఎలాంటి డైట్ తీసుకుని బాడీని ఫిట్ గా వుంచుకోవాలో చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నా ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. "అంటూ మానస్ ఒక హార్ట్ టచింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.