మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్

  ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. కొద్ది నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. మరోవైపు, దాదాపు 9 వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు కొన్ని వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  జూన్ 2024 నాటి గణాంకాల ప్రకారం, మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. తాజా లేఆఫ్‌ల కారణంగా దాదాపు 9,100 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటున టెకీలు గొప్పలకు పోయి వృధాగా ఖర్చు పెట్టొద్దని మిడతల్లా అందుబాటు లో ఉన్నది మొత్తం తినేయడం కాదని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తెలుగోళ్లు సాఫ్ట్వేర్ ఉంటారు. ఇంకా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉంటే బ్లూ కాలర్ పనులకోసం బీహార్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వారు మన రాష్ట్రాని వస్తున్నారు. బతుకు తెరువు కోసం తెలుగు వారు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాల్సిన కాలం ఎంతో దూరంలో లేదని నిపుణులు భావిస్తున్నారు.  
మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్ Publish Date: Jul 3, 2025 3:18PM

పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్

మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి  పాదయాత్రతోనే అధికారంలో రావాలని భావిస్తున్నారు. మొత్తానికి పరదాల మాటు సీఎం  అనిపించుకున్న జగన్ ఇప్పుడు పాదయాత్రం అంటుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తానని  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్‌.  జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది.  జగన్‌కు పాదయాత్ర కొత్త ఏమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు.  వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో రెండు రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ  పర్యటనల షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించనే లేదు. ఈ సారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో అయన వెల్లడించలేదు.  అదలా ఉంటే.. అధికారంలో ఉన్నంత కాలం బయటకొస్తే పరదాల మాటున పాలన కొనసాగించిన జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటుండటంపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా జనంలోకి రావడానికి సంకోచిస్తున్నట్లు పరదాల మాటునే గడిసేసిన ఆయన పాదయాత్ర అంటుండటంతో.. పరదాలు పోయి, పాదయాత్ర వచ్చిందని నెటిజన్లు  ఎద్దేవా చేస్తున్నారు. పవర్ పోగానే ప్రజల్లోకి వస్తానంటుండటంతో అప్పుడు జనం గుర్తుకు రాలేదా అన్న విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి.
 పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్ Publish Date: Jul 3, 2025 2:55PM

బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు  ఆమె  పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ముందడుగు వేయలేదని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి  ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని తెలిపారు.  బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు.   
బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 3, 2025 2:39PM

శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా?

మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.  దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి అనివార్య పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం  డైలమాలో పడటానికి కారణం స్వయంకృతాపరాధమే అంటున్నారు. వ్యాపార వేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో తెలుగుదేశంలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో శిద్దా పరాజయం పాలయ్యారు. అయినా శిద్దా రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించి చంద్రాబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు సైకిల్ దిగి ప్యాన్ గూటికి చేరారు.  అయితే వైసీపీలో చేరిన శిద్దాకు అక్కడ కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీ లో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా..  2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కూడా కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు గడిసిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండి పోయారు. అయితే ఆయన అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం   చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడి పోయిన వారిని ఎవరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని.. శిద్దా రాఘవరావు ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన శిద్దా వైసీపీకి వెళ్ళి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యిందట. శిద్దా రాఘవరావు తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా శిద్దా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీచేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్  పెత్తనమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం కల్పించిన చిక్కుల నుండి బయట పడేందుకు శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైసీపీకి రిజైన్ చేసి, టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.  దీంతో ఆయనతో పాటు సిద్దా సుధీర్ రాజకీయ భవిష్యత్ కూడా డోలాయమానంలో పడింది.   2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న శిద్దా కుటుంబం ఇప్పుడు ఇంటికే పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై  నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా  రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో ఆయన అప్పట్లో ససేమిరా అన్నారంట. చేజేతులా చేసుకున్న దానికి   ఇప్పుడు అనుభవి స్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.
శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా? Publish Date: Jul 3, 2025 2:12PM

జగన్ తో వంశీ భేటీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు  వల్లభనేని వంశీ  ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే  తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ..  కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఇలా ఉండగా వంశీ వైసీపీకిగుడ్ బై చెప్పనున్నారనీ, రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
జగన్ తో వంశీ భేటీ Publish Date: Jul 3, 2025 1:53PM

సిగాచీ షేర్లు ఢ‌మాల్!

పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత  ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి.  3 రోజుల్లోనే  దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.  ఒక్కొక షేర్ పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడం, ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు, కంపెనీ సిబ్బంది మృత్యువాత పడటం తెలిసిందే. ఈ సంఘటన తరువాత ఆ కంపెనీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్ లో బారీగా పతనమైంది.  దీంతో  సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదం పై నేషనల్  స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసింది.  పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో  మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది.   ప్రమాదనికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందనీ, హైదరాబాద్ ప్లాంట్ లో మూడు నెలలపాటు   కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  దేశ వ్యాప్తంగా  సిగాచీకి  నాలుగు పరిశ్రమలున్నాయి. పాశమైలారంతో పాటు సుల్తాన్ పూర్, కర్ణాటకలోని రాయచూర్, గుజరాత్ లోని జగడియ, ధహేజ్ లలో మొత్తం 4 పరిశ్రమలు నడుస్తున్నాయి. సంస్థ‌కు వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది.  సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ  1989లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది.  2012లో వాణిజ్యపరంగా విస్తరించేందుకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. 2019లో స్టాక్ మార్కెట్ లో  లిస్ట్ కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రస్తుతం  ఈ ఇండ‌స్ట్రీకి సుమారుగా రూ.1680 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న‌ట్టు చెబుత‌న్నాయి కంపెనీ గ‌ణాంకాలు. ఈ కంపెనీ ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రమాదం జరిగిన పాశమైలారం యూనిట్లో- మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేస్తోంది. వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రిడియంట్స్ ను  తయారు చేస్తోంది. ఇది బైండింగ్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది.  డ్రగ్ తయారీలో ఈ ఔషధాన్ని ఉపయోగించి మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారు చేస్తారు.  ఏడాదికి ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఎండీ క‌మ్  సీఈవోగా అమిత్ రాజ్  సిన్హా, చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్ గా చిదంబరనాథన్  ఉన్నారు.  ప్రమాదం జరిగిన పాశమైలారం సిగాచి ప్లాంటు కార్యకలాపాలన్నీ వైస్  చైర్మన్ చిదంబరనాథన్ అధ్వ‌ర్యంలో జరుగుతాయని చెబుతున్నారు.
సిగాచీ షేర్లు ఢ‌మాల్! Publish Date: Jul 3, 2025 12:25PM

ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా?

ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు.  ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా? ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా ఎలాన్ మస్క్ ట్రంప్ ను పొగుడుతూ కామెంట్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు జనబాహుల్యం నుంచి ఉత్పన్నమౌతున్నాయి.   నిజానికైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన వెంట‌నే తాను ద అమెరికా పార్టీ  స్థాపించడం తథ్యమని మస్క్ తెగేసి చెప్పారు.  ఈ లోగా ట్రంప్ ఒక కామెంట్ చేశారు. అస‌లు మ‌స్క్ త‌న పెట్టేబేడా స‌ర్దుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు అన్నేసి స‌బ్సిడీల‌ను ఇచ్చామ‌ని బాంబు పేల్చారు ట్రంప్. దెబ్బ‌కు జ‌డుసుకున్న మ‌స్క్ ట్రంప్ ని వెన‌కేసుకొచ్చారు. క్రెడిట్ ఇవ్వాల్సిన  చోట ఇవ్వాల్సిందే అన్నారు. ఇజ్రాయెల్ గాజాలో అర‌వై రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పుకుంద‌ని ట్రంప్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఆయ‌నీ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్- మ‌స్క్ స్నేహ బంధం 2016 నాటిది. వీరిద్ద‌రూ ఈ తొమ్మిదేళ్ల‌లో ఎన్నో సార్లు విడిపోయి, క‌లిసిపోయిన చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రి గ‌రించి ద గార్డియ‌న్ ప‌త్రిక 2024లో  ఇద్ద‌రు సంప‌న్న మిత్రుల మ‌ధ్య గాఢ ప్రేమానుబంధంగా అభివ‌ర్ణిస్తూ ఓ వ్యాసం ప్రచురించింది. మ‌స్క్ కి ట్రంప్ కి ఉన్న గాఢ స్నేహానుబంధం ఎలాంటిదంటే.. ట్రంప్ ఒక ద‌శ‌లో ట్విట్ట‌ర్ ఖాతాను కోల్పోయారు. దీంతో ఆయ‌న జోబైడెన్ చేతుల్లో ఓడి పోవ‌ల్సి వ‌చ్చిందప్ప‌ట్లో. అయితే గ‌త ఎన్నిక‌ల నాటికి అదే ట్విట్ట‌ర్ ని కొని దానికి ఎక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి.. దానిలోని ట్రంప్ ఖాతాను రీ- జ‌న‌రేట్ చేశారు మ‌స్క్.  అంతేనా.. డెమోక్రాటిక్ అభ్యర్థి క‌మ‌లా హారిస్ మీద విరుచుకుప‌డ్డారు  కూడా.   ఆ ఎన్నికలపై ఇది తీవ్ర ప్ర‌భావం చూపించింది.   ఎట్ట‌కేల‌కు గెలిచాం కదా అనుకుంటే ట్రంప్ నుంచి మస్క్ కు ఆశించినంత  సాయం అందలేదు. ఎన్నో విష‌యాల్లో ట్రంప్ మ‌స్క్ కి మ‌స్కా కొట్టారు. ఇస్తాన‌న్న‌వేవీ ఇవ్వ‌క పోగా.. మ‌స్క్ కి ప‌బ్లిక్ లో తీవ్ర వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్ట క‌నిపించింది. డోజ్ ద్వారా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర‌స‌న‌గా.. త‌న టెస్లా షోరూములు ధ్వంసం కావ‌డం..  ఆపై షేర్ల ధ‌ర‌లు ప‌డిపోవ‌డం  అటుంచితే..  త‌న సంప‌ద వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర ఆవిర‌య్యింది. అంతేనా త‌న మిత్రుడిని నాసా చీఫ్ చేస్తాన‌న్న మాట కూడా మ‌రిచారు ట్రంప్.  ప్ర‌శాంతంగా కొత్త కొత్త ఐడియాల‌తో బిజినెస్ చేసుకోకుండా.. అన‌వ‌స‌రంగా విరాళ‌మిచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇలాంటి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా? అంటారు మస్క్ తండ్రి   ఎరోల్ మ‌స్క్.  ప్ర‌స్తుతం మావాడికేం పెద్ద వ‌య‌సు అయిపోలేద‌నీ.. న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడ‌నీ.. అదిగానీ క్లిక్ అయితే ద‌శ తిరిగిపోతుంద‌ని అంటారాయ‌న‌. కార‌ణం మస్క్ కొత్త ప్రాజెక్టు వెన్నుముక విరిగిన వారికి సంసార జీవితం, కంటి చూపులేని వారికి చూపు ప్ర‌సాదించే దివ్య ఔష‌ధం. అలాంటి ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అయితే పోయిన సంప‌ద‌ అంతకు అంతగా మారి తిరిగి వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌స్క్ వ‌య‌సు 53 ఏళ్లు కాగా.. సంప‌ద విలువ 300 బిలియ‌న్ డాల‌ర్లు. ట్రంప్ లా లాస్ట్ స్టేజ్ లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ నెట్ ప్రాక్టీస్ గా ప‌డి ఉంటుంది లెమ్మ‌ని.. కాస్త ఎర్లీగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన మ‌స్క్.. ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా పార్టీ పెట్టేస్తా అన‌గానే అంద‌రూ షాక‌య్యారు. ఇప్పుడు చూస్తే పార్టీ లేదూ గీర్టీ లేదు తూచ్ అంటున్నారు. మ‌రి చూడాలి. ట్రంప్ తో ఈ చెలిమి కంటిన్యూ అవుతుందా లేక ఇద్ద‌రి మ‌ధ్యా మళ్లీ వివాదం మ‌రింత ముదిరి.. కొత్త పార్టీకి దారి తీస్తుందా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.
ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా? Publish Date: Jul 3, 2025 11:18AM

విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ

వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో  పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ తీసుకుని గాలిలో ఉండగానే విమానం కిటికీ ఫ్రేమ్ ఊడి పడింది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ థృవీకరించింది. అయితే ఈ ఘటన ప్రయాణీకుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. విమానం కిటికీ ఫ్రేమ్ ఊడిపడగానే పైలట్ విమానాన్ని తిరిగి పుణెలో ల్యాండ్ చేశారనీ, అక్కడ ప్రమాణాలకు అనుగుణంగా కిటికీ ఫ్రేమ్ ను బిగించిన తరువాత విమానం యథావిథిగా పుణె నుంచి గోవాకు బయలుదేరి వెళ్లిందని తెలిపింది.  
విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ Publish Date: Jul 3, 2025 10:59AM

రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి

పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ వివారు కాటేదాన్ లోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.   పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడిసరుకు ఉండటం మంటలు వేగంగా వ్యాపింపిచ దట్టమైన పొగ అలుము కోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.  
రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి Publish Date: Jul 3, 2025 10:36AM

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలో  భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి. మంటలు వేగంగా   వ్యాపించడంతో పలు దుకాణాలు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  కాగా ఈ ప్రమాదంలో ఆలయరథానికి ఎటువంటి ముప్పు కలగలేదని, మంటలు వ్యాపించగానే ఆలయ రథాన్ని సురక్షితంగా అక్కడ నుంచి తరలించేశామనీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.   
 తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం Publish Date: Jul 3, 2025 10:18AM

ములుగు బిఆర్ఎస్ లో ముఠా తగాదాలు?!

ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ  జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో  బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.  పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సిన వ్యక్తే పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడడానికి కారకుడిగా మారుతున్నారంటూ పార్టీ వర్గాలే  బాహాటంగా చెబుతున్నాయి.  పార్టీ  శ్రేణుల సమాచారం మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వస్తుండటమే కాకుండా.. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ కు సహకరించవద్దంటూ పార్టీ క్యాడర్ కు హుకుం జారీ చేశారు. దీంతో  నియోజకవర్గ ఇన్చార్జి కేవలం ఒక్క మండలానికే పరిమితమైన పరిస్థితి.  దీంతో ములుగు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు. ములుగు జిల్లా లో ఒకే నియోజకవర్గం ఉండటం అదీ ఎస్టీ   నియోజకవర్గం.  ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీ చైర్మన్ మాజీ  బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బంధువు అయిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కాకులమారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.  గత ఎన్నికల్లో  ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  సీతక్క బరిలో నిలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచడంతో ములుగు నుంచి పోటీచేసిన జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమే నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.    అయితే ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కాకులమారి లక్ష్మీ నరసింహారావు తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఒక దశలో ఆయనను పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది.  అయితే  ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లాబీయింగ్ తో పార్టీ ఆయనను ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని అంటారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కాకులమారి లక్ష్మీనరసింహరావు తన ఒంటెద్దు పోకడలతో  పార్టీ బలహీనం కావడానికి కారకుడౌతున్నారని అంటున్నారు. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్  నాగజ్యోతితో విభేదాల కారణంగా  జిల్లా పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి.   గత ఎన్నికలలో పార్టీ  పరాజయం పాలై అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన నేపథ్యంలో.. సమైక్యంగా ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలో కూడా ములుగు జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలతో కూనారిల్లుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.  ములుగు జిల్లా అధ్యక్షుడిగా స్థానికంగా ఉండాల్సినకాకులమారి లక్ష్మీనరసింహరావు హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా అతిథిగా జిల్లాకు వస్తున్నారనీ, ఆయన అందుబాటులో లేకపోవడమే కాకుండా.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ తాను లేకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారనీ, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ చార్జి నాగజ్యోతికి సహకరించొద్దంటూ శ్రేణులకు హుకుం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో బడే నాగజ్యోతి పేరుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ అయినా కేవలం తన సొంత మండలం తాడ్వాయికే పరిమితమైన పరిస్థితి.    కాకులమారి లక్ష్మీనరసింహరావుకు మంత్రి సీతక్కతో సత్సంబంధాలు ఉండటం,  పారిశ్రామిక వేత్తగా ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా అధికార పార్టీకి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటం లేదనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై  పోరాటాలకు వెనుకంజ వేస్తున్నారనీ, మొత్తంగా ఆయన సీతక్కకు విధేయుడిగా ఉంటున్నారనీ  టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ములుగు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి కారణం జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తుపోకడలేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.    నాగజ్యోతికి ప్రజాబలం లేదు అని అధిష్టానం దగ్గర నిరూపించి, ఆమె స్థానంలో తన అనుచరుడిని తీసుకురావాలన్న యోచనతో కాకులమారి లక్ష్మీనరసింహరావు పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం ములుగు జిల్లాపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  
ములుగు బిఆర్ఎస్ లో  ముఠా తగాదాలు?! Publish Date: Jul 3, 2025 10:11AM

ఈ 5 ఆహారాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే చాలు.. ఎన్నేళ్లు గడిచినా యవ్వనంగా ఉంటారు..!

  వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు నెరవడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా చాలా కాలం పాటు యవ్వనంగా,  ఆరోగ్యంగా ఉండవచ్చు. కొన్ని ఆహారాలు (Foods for Anti-Aging) కూడా  యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి.  శరీరాన్ని లోపలి నుండి బలంగా చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుని వాటిని  రెగ్యులర్ గా తీసుకుని, అవెలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. టమోటా. టమోటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది,  ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే  ఆహారంలో టమోటాను ఖచ్చితంగా చేర్చుకోవాలి. టమోటాలను ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు. పసుపు.. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కర్కుమిన్ ఉంటుంది. అందువల్ల దీనిని "గోల్డెన్ స్పైస్" అని పిలుస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఉదయం పసుపు కలిపిన పాలు తాగడం లేదా పసుపు నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది,  వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి  ఆహారంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి,  జీవక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందువల్ల, ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాలేయం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.                              *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఈ 5 ఆహారాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే చాలు.. ఎన్నేళ్లు గడిచినా యవ్వనంగా ఉంటారు..! Publish Date: Jul 3, 2025 9:30AM

మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే.. ఇలా చేయండి..!

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు.  మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో ధనం అంతగా పెరుగుతుందని నమ్మకం.  అయితే కొన్ని ఇళ్లలో మనీ ప్లాంట్ అస్సలు సరిగ్గా పెరగదు.  వర్షాకాలంలో అయినా, సాధారణ రోజులలో అయినా మనీ ప్లాంట్ పెరుగుదల విషయంలో గందరగోళ పడే వారు ఉంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది.  మనీ ప్లాంట్ బాగా,  గుబురుగా పెరగాలన్నా,  వేగంగా పెరగాలన్నా ఇంట్లోనే ఉన్న 5 పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.  ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. మనీ ప్లాంట్ కోసం ఎరువు.. మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఇంట్లోనే దీనికి మంచి పోషకం కలిగిన ఎరువును తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంట్లోనే లభించే 5 పదార్థాలు చక్కగా పనిచేస్తాయి. కావలసిన పదార్థాలు.. టీ ఆకులు లేదా టీ పౌడర్ పసుపు బెల్లం బంగాళదుంప తొక్కలు ఆవాలు తయారు చేసే విధానం.. ముందుగా టీ తయారు చేసిన తరువాత మిగిలిపోయే టీ పౌడర్ ను పడేయకూడదు.  ఈ టీ పౌడర్ ను మళ్లీ ఎండబెట్టాలి. వంటింట్లో బంగాళదుంపలను వినియోగించినప్పుడు తొక్కలు తీస్తుంటారు.  ఈ తొక్కలను కూడా ఎండబెట్టాలి.   టీ పౌడర్, బంగాళదుంప తొక్కలు బాగా ఎండిన తరువాత వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ టీ పౌడర్ లో కాసింత చిన్న బెల్లం ముక్క వేయాలి.  దీంతో పాటు ఆవాలు,  పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి.  ఇలా తయారైన పొడిని మనీ ప్లాంట్ మొదట్లో కాసింత ఎరువులాగా వేసి నీరు పోయాలి. ఇలా 10 లేదా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మనీ ప్లాంట్ చాలా వేగంగా, బాగా పెరుగుతుంది.  కేవలం మనీ ప్లాంట్ కు మాత్రమే కాదు.. ఇతర తీగ జాతి మొక్కలకు,  పూల మొక్కలకు కూడా ఇలా చేయవచ్చు. ఏ పదార్థాలు ఎలా పనిచేసాయి.. బెల్లం.. బెల్లం నేలలో చిన్న చిన్న మంచి సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేస్తుంది, నేలను మరింత సారవంతం చేస్తుంది.  మొక్క అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది. టీ ఆకులు.. ఉపయోగించిన టీ ఆకులు మనీ ప్లాంట్ ఆకులను ముదురు ఆకుపచ్చగా,  పెద్దవిగా చేస్తాయి. ఇందులో నత్రజని ఉంటుంది.  ఇది ఆకుల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. ఆవాలు.. ఇందులో నత్రజని, భాస్వరం,  పొటాషియం ఉంటాయి. ఇవి మొక్క బాగా పెరగడానికి, వేర్లు బలంగా,  ఆకులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది నేలను కూడా మెరుగుపరుస్తుంది. పసుపు.. పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మొక్కను వ్యాధులు,  కీటకాల నుండి రక్షిస్తుంది.  ముఖ్యంగా వేరు కుళ్ళును నివారిస్తుంది. ఇది నేలను శుభ్రంగా ఉంచుతుంది. బంగాళాదుంప తొక్కలు.. బంగాళాదుంప తొక్కలలో పొటాషియం ఉంటుంది. ఇది మనీ ప్లాంట్ ఆకులను మెరిసేలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మొక్క యొక్క బలాన్ని పెంచుతుంది  వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.                        *రూపశ్రీ.  
మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే.. ఇలా చేయండి..! Publish Date: Jul 3, 2025 9:30AM

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా దుష్ప్రచారం.. చర్యలు తప్పవన్న టీటీడీ

తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో  వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది.  టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .  తాజాగా జూన్ 29  మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు. అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా..  ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు  తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది.   అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.  
తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా దుష్ప్రచారం.. చర్యలు తప్పవన్న టీటీడీ Publish Date: Jul 3, 2025 9:28AM

ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం

  శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.  28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా  బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.  
ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం Publish Date: Jul 2, 2025 10:00PM

తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

  టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్.. తిరుమలలోని ఆస్థాన మండపంలో ‘శ్రీనివాస కళార్చన’ పేరుతో రెండు రోజుల నాట్య ప్రదర్శనను నిర్వహిస్తానని చెప్పి శ్రీవారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారిక అనుమతి లేకుండానే తెలుగు రాష్ట్రాల్లోని 93 కళాబృందాలకు చెందిన 2,900 మంది కళాకారులను నమ్మించి మోసం చేశాడు.  వారి వద్ద నుంచి రూ.35 లక్షలు వసూలు చేశాడు. కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చాడు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అనుమతి లేదని, ఈ మొత్తం ప్రక్రియ ఒక మోసపూరితం అని గుర్తించి తిరుమల వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జులై 1న అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు.  
తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ Publish Date: Jul 2, 2025 9:49PM

జూబ్లీహిల్స్ పై చంద్రబాబు దృష్టి?

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్‌లో ఉన్న పాత టీడీపీ క్యాడర్‌కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది.  ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 
జూబ్లీహిల్స్ పై చంద్రబాబు దృష్టి? Publish Date: Jul 2, 2025 9:04PM

ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు డిస్మిస్

  ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ కస్టడీకి తీసుకుని వీరిని మరింతగా విచారించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  తమకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది.  బెయిల్ పిటిషన్లపై ఇటీవల న్యాయస్థానం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. మద్యం కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
 ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ Publish Date: Jul 2, 2025 8:46PM

చైనా అధ్యక్షుడు కనిపించుట లేదు

    చైనా అధ్యక్షుడు  జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకీ హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండడం వల్ల.. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చని భావించారు. జూలై 6,7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జింగ్ పింగ్ హాజరు కావడం లేదని చెప్పడంతో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నారు. తొలిసారిగా ఆయనీ బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరువుతున్నారు. జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కి జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గానూ వ్యవహారిస్తున్నారు. చైనా లో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? అన్నదొక చర్చ. ప్రస్తుతం చైనాలో జనరల్ ఝాంగ్ యుజియానే అధికారం చెలయిస్తున్నట్టు తెలుస్తోంది. జనరల్ ఝాంగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నారు. జనరల్ ఝాంగ్ 24 మంది సభ్యులు గల.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు. సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ ఝాంగ్ యుజీయ కి బలంగానే ఉంది. సెంట్రల్ కమిటీ లో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో అనుచరులున్నారు. సెంట్రల్ కమిటీ లో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియా కి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు హు జింటావో మద్దతుదారులు కావడం వల్ల జింగ్ పింగ్ కి వీరంతా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చైనా లోని పాఠశాల విద్యార్థులకు జింగ్ పింగ్ పాఠాలు చెబుతున్నారు. చైనా పాఠశాల పుస్తకాల్లో జింగ్ పింగ్- ఆలోచనలు అనే పేరు మీద విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులకి నచ్చడం లేదట. ఇప్పటికే మావో- ఆలోచనల పేరిట పాఠాలు చెబుతుండగా కొత్తగా ఈ జిన్ పింగ్ ఆలోచనలేంటన్నదొక ప్రశ్న.  అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవం, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని తన అనుచరులకే ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తుదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు.. గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదని అంటారు. వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదన్నది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.  
చైనా అధ్యక్షుడు కనిపించుట లేదు Publish Date: Jul 2, 2025 8:26PM

నెక్స్ట్ రెడ్ బుక్ టార్గెట్ ఎవరు?

    ఎట్టకేలకు వల్లభనేని వంశీకి  బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే  వంశీని జైలు జీవితం విడిపోతుందా!  లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా?  అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అనవసరంగా నోరు పారేసుకుని,  రెడ్ బుక్ బాధితులుగా మారిన అనేక మంది ,ఇప్పటికే కారాగారంలో ఊసలు లెక్కపెట్టి వచ్చారు.... అందులో సినిమా రంగానికి చెందినవారు, పత్రికారంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు అన్న తేడా లేకుండా, ఎవరీ లెక్కలు వాళ్ళకి అప్పజెప్తుంది రెడ్బుక్ ....అయితే అందరికన్నా అగ్ర తాంబూలం ఈ రెడ్ బుక్కులో ఎవరికి అందబోతుంది ....ఇప్పటికీ రేట్ బుక్ లో మొదటి పేజీ మాత్రమే చూస్తున్నారని చెబుతున్న టిడిపి కార్యకర్తల మాటల్లో ఆంతర్యం ఏంటి ? రెడ్ బుక్ లో తదుపరి పేజీల్లో ఎవరెవరి పేర్లు పొందుపరిచి ఉన్నాయి.   నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ...అనే సామెత ఉంది ....పెద్దవాళ్లు ఊరికే అనలేదా మాట ...ఎక్కడైతే అనవసరంగా నోరు పారేసుకుంటామమో ,అక్కడ మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది... అని పెద్దలు ముందే గమనించబట్టి ఈ సామెతలు కనిపెట్టి ఉంటారు.... అయితే ఇటీవల రాజకీయాల్లో ఈ మాటను ఎవరు వినడం లేదు  సరి కదా, పెడ చెవిన పెడుతున్నారు ... దీంతో వాళ్లు వీళ్ళు అని తేడా లేకుండా, ప్రతి ఒక్కరు సమస్యల్లో ఇరుకుంటున్నారు ..  అలాంటి బాపతే గడిచిన కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జైలలో కాలక్షేపం చేస్తున్న నాయకులు... మాజీ ఎంపీ నందిగం సురేష్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇప్పుడు తాజాగా 140 రోజులు జైలు జీవితానికి బెయిల్ తీసుకున్న వల్లభనేని వంశీ,,, వీరంతా వేరే వేరే కేసుల్లో జైలు జీవితం అనుభవించిన దీనంతటి సారాంశం అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్నారు అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియంది కాదు.... అయితే ఇప్పటికీ వల్లభనేని వంశీ జైలు జీవితం కథకు పుల్ స్టాప్ పడినట్లేనా లేక ఇతర వ్యవహారాల్లో మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం వల్లభనేని వంశీని వెంటాడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒక్క వల్లభనేని వంశీ నే కాదు,... ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారు వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం రుచి చూపించాలని ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతుంది ....అలాంటప్పుడు ఒళ్ళు ,నోళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి... ఈ హెచ్చరికలు విషయం పక్కనపెడితే, ఇప్పుడు రెడ్ బుక్ లోని మొదటి పేజీ నడుస్తుంది ....ఈ రెడ్బుక్ లోని మొదటి పేజీలో ఇంకెన్ని పేర్లు ఉన్నాయి? చివరి పేజీకి వచ్చేసరికి ఎంతమంది నాయకులు జైల్లో మగ్గాల్సి వస్తుంది అన్న చర్చ కూడా జరుగుతుంది ....ఇక తాజాగా వినిపిస్తున్న పేర్లు టిడిపి వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది... టిడిపి సోషల్ మీడియాలో కొందరి వైసీపీ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి....సీదిరి అప్పలరాజు నుండి ,కొడాలి నాని వరకు ఆ లిస్టులో పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు, సీదిరి అప్పలరాజు , రాంగోపాల్ వర్మ ,శ్రీరెడ్డి మాజీ మంత్రులు,పేర్ని నాని , జోగి రమేష్,  అంబటి రాంబాబు విడదల రజిని , మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ప్రముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.... అయితే ఇందులో ఇప్పటికే కొంతమందికి,కొన్ని  కేసులలో నోటీసులు వచ్చిన, తమకున్న టాలెంట్ ఉపయోగించి కోర్టులకు వెళ్లి కొంత ఉపశమనం పొందారు ...అయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ మరోసారి రెడ్బుక్ వ్యవహారాన్ని పరిచయం చేపించాలని టిడిపి శ్రేణులు ఉవ్విల్లు ఊరుతున్నట్లు తెలుస్తోంది.. . చంద్రబాబుకు మైండ్ పోయిందని ట్రీట్మెంట్ చేయించాలని, వయసును కూడా గౌరవించకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడిన మాజీ మంత్రి అప్పలరాజు, ఇప్పుడు రెడ్ బుక్ లోని మరో పేజీలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది  అంతేకాదు వల్లభనేని వంశీకి ఆత్మీయ మిత్రుడు, టిడిపికి గతంలో కొరకరాని కొయ్యగా మారి ఇప్పుడు చడిచప్పుడు లేకుండా అనారోగ్య సమస్యలతో హైదరాబాదులో మకం వేసి ఉంటున్న కొడాలి నాని కి , రెడ్ బుక్కు లో ప్రముఖ పేజీ ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది .... దీంతోపాటు టిడిపిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు తో పాటు ఇటీవల పోలీసులపై కూడా దూకుడు ప్రదర్శించిన, మాజీ మంత్రి అంబటి రాంబాబు, జగన్ పర్యటనలో ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారణమైన నాయకులకు త్వరలోనే కేసుల చిట్టా పరిచయం కాబోతుందని ప్రచారం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కారాగారంలో కాలక్షేపం చేసే నాయకులు వీళ్లేనా?  టిడిపి క్యాడర్ చేసుకుంటున్న,చర్చలో నిజం ఎంతో అబద్ధం ఎంతో టిడిపి నేతలకే తెలియాలి ....అయితే టిడిపి కార్యకర్తలు మాత్రం చేసిన తప్పుకే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కానీ,  టిడిపి వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదనేది చెబుతున్న మాట .... సరే ఎవరి మాట ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే,  ఒక పద్ధతి ప్రకారం రెడ్ బుక్ లో పేజీల్లో ఉన్న నాయకులకు ట్రీట్మెంట్ జరుగుతుందనేది వాస్తవం. మరి ఈ తదుపరి పేజీల్లో ఉండే తదుపరి నాయకులు ఎవరో కాలమే నిర్ణయించాలి
నెక్స్ట్ రెడ్ బుక్ టార్గెట్ ఎవరు? Publish Date: Jul 2, 2025 8:18PM

శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే జగన్ జైలు యాత్రలు : సోమిరెడ్డి

  శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. పిచ్చి వేషాలు వేద్దామనుకుంటే..పోలీసులు తాట తీస్తారు..జాగ్రత్త అని సోమిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా దుర్మార్గాలు, పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎల్లుండి రఫ్ఫా రఫ్పా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంటని ఆయన దుయ్యబట్టారు. రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడని ఆయన అన్నారు.  మూడు కార్లు, 100 మంది జనానికి అనుమతి తీసుకుని 9 గంటల పాటు 80 కిలోమీటర్లు ర్యాలీ చేశాడని సోమిరెడ్డి వెల్లడించారు. 680 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించినా మూడు ప్రాణాలను తీసుకున్నాడని తెలిపారు. జగన్ రెడ్డి కారు కింద సింగయ్య ప్రాణం నలిగిపోతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లాలనే మానవత్వం కూడా చూపలేదని  చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నాని తెలిపారు. జైలు వద్దకు వెళ్లి గోవర్ధన్ రెడ్డి అందాలను పొగుడుకుని వెళితే మాకెలాంటి అభ్యంతరం లేదు..చీమకు నష్టం జరిగినా ఊరుకోబోమని ఆయన గుర్తుంచుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు అతిగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు
శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే జగన్  జైలు యాత్రలు  : సోమిరెడ్డి Publish Date: Jul 2, 2025 8:02PM

ఏపీలో ఆ జిల్లాల మధ్య విమాన సేవలు ప్రారంభం

  కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర  పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు రాకపోకలు సాగనున్నాయి. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ త్వరలోనే డ్రోన్ హబ్ కర్నూలుకు రాబోతోందని తెలిపారు. ఇందుకోసం కర్నూలు విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు.
ఏపీలో ఆ జిల్లాల మధ్య విమాన సేవలు ప్రారంభం Publish Date: Jul 2, 2025 6:36PM

కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

  ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం  కుప్పంపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం నియోజకవర్గం తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని సీఎం తెలిపారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీళ్ల అందిస్తామని హామీ ఇచ్చారు.  కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు .కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చంద్రబాబు వెల్లడించారు. ఈవీ బస్సులు, ఆటోలు, ఇంటింటికీ సౌర విద్యుత్ తీసుకువస్తామని సీఎం తెలిపారు
కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు Publish Date: Jul 2, 2025 5:33PM

జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా?

పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు..పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇది అయితే..  జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.  జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు.  అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జనసమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు ఆగడాలు, అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే జగన్ పరామర్శయాత్ర అంటూ బలప్రదర్శనకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. దీంతో శాతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రజా భద్రత ధ్యేయంగా తాము అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుందనీ, అందుకే నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు కు సూచించామనీ పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారన్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయిందనీ, నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకీ అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగా నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాణిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్ లో వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది.  పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సంద ర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్ పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్ కు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం కనుక నెల్లూరు పర్యటనను, కాకాణి పరామర్శనూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారనీ, అనుమతి ఇవ్వలేదనీ ప్రచారం చేసుకుంటున్నారు.  పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ కు స్థలం చూపామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 
జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా? Publish Date: Jul 2, 2025 5:28PM

ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్‌ రాజీనామా

  ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ… ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.  ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, మరియు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మద్దతుతోనే తాను ఈ స్థితికి చేరినట్టు పేర్కొన్నారు.ముందుకు సాగుతున్న తాను, సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని, కృతజ్ఞత, స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని తన సంకల్పాన్ని తెలియజేశారు. సిద్ధార్థ కౌశల్‌ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్య­తలు నిర్వర్తించారు. వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తరు­వాత ఢిల్లీలో కార్పొ­రేట్‌ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు టాక్.
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్‌ రాజీనామా Publish Date: Jul 2, 2025 4:38PM

ఫార్ములా- ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు

  ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు  విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్‌కు నోటీసులివ్వడం ఇది నాలుగోసారి.  కాగా ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇదే కేసులో విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్‌కు అరవింద్ కుమార్  వచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్‌ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే
ఫార్ములా- ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు Publish Date: Jul 2, 2025 4:26PM

మాజీ ప్రధానికి 6 నెలల జైలు శిక్ష

  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ 6 నెలలు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెకు ఈ శిక్ష వేసింది. గతేడాది బంగ్లాలో అల్లర్లతో దేశం విడిచి పారిపోయిన ఆమెపై అక్కడి ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వాటి విచారణకు హాజరుకాకపోవడంతో హాసీనాకు జైలు శిక్ష విధించింది. హసీనాతో పాటు.. గైబంధలోని గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కుకూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల జైలు శిక్ష విధించింది. 11 నెలల క్రితం పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ మాజీ నాయకురాలికి పడిన తొలి శిక్ష ఇదే,  గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
మాజీ ప్రధానికి 6 నెలల జైలు శిక్ష Publish Date: Jul 2, 2025 4:04PM

పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సిగాచీ పరిశ్రమ

పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 40 మంది మరణించినట్లు సిగాచీ అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో 33 మంది గాయపడినట్లు ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామనీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. ఈ మేరకు సిగాచీ తరఫున ఆ కంపెనీ కార్యదర్శి వివేక్ కుమార్ ఓ ప్రకటక విడుదల చేశారు.  ఈ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు కూడా  సమాచారం ఇచ్చిన ఆయన మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  
పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సిగాచీ పరిశ్రమ Publish Date: Jul 2, 2025 4:01PM