తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలో  భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి. మంటలు వేగంగా   వ్యాపించడంతో పలు దుకాణాలు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  కాగా ఈ ప్రమాదంలో ఆలయరథానికి ఎటువంటి ముప్పు కలగలేదని, మంటలు వ్యాపించగానే ఆలయ రథాన్ని సురక్షితంగా అక్కడ నుంచి తరలించేశామనీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu