ఫార్ములా- ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు
posted on Jul 2, 2025 4:26PM

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్‌కు నోటీసులివ్వడం ఇది నాలుగోసారి. కాగా ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇదే కేసులో విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్‌కు అరవింద్ కుమార్ వచ్చారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే