ఏపీలో ఆ జిల్లాల మధ్య విమాన సేవలు ప్రారంభం
posted on Jul 2, 2025 6:36PM

కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు రాకపోకలు సాగనున్నాయి. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ త్వరలోనే డ్రోన్ హబ్ కర్నూలుకు రాబోతోందని తెలిపారు.
ఇందుకోసం కర్నూలు విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా కర్నూలులో మంత్రి టీజీ భరత్ తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు.