బిగ్ బాస్ హోస్ట్ ని మార్చేయాలి..
on Jul 2, 2025
.webp)
బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట మొదలయ్యింది. అలాగే కామన్ మ్యాన్ క్యాటిగారీ కోసం కూడా రెజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. ప్రోమోలు వస్తున్నాయి. ఈ టైములో గత బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ బిగ్ బాస్ విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ ఒకే కంటెస్టెంట్ ప్రతీ సీజన్ లో కనిపిస్తూ ఉంటే బోరింగ్ గా ఉంటుంది. కానీ హోస్ట్ మాత్రం ప్రతీ సీజన్ ఉండాల్సి వస్తే మాత్రం ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కి కొత్తదనాన్ని చూపించాలి. ఆల్రెడీ హోస్ట్ నాగార్జున గారిని ఐదారు సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. హోస్ట్ నాగార్జున గారు ఈ సీజన్ కి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తారు అని ఆశిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.
ఒక కొత్తదనంతో యాంకరింగ్ చేసే వాళ్ళు ఉంటే జనాలకు రొటీన్ కాకుండా ఉంటుంది. అప్పుడు బిగ్ బాస్ రేటింగ్స్ కూడా పీక్స్ కి వెళ్తుంది. 2017 లో మొదలైన బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా 8 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. 1st సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, 2nd సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత 3rd సీజన్ నుంచి 8th సీజన్ వరకు నాగార్జున హోస్ట్ ఉన్నారు. గత రెండు సీజన్స్ నుంచి కూడా హోస్ట్ ని మార్చమంటూ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కంటెస్టెంట్స్ మారుతున్నారు తప్ప హోస్ట్ మాత్రం చేంజ్ కావడం లేదు. బిగ్ బాస్ లో అందరూ కంటెస్టెంట్స్ గా వెళ్లి ఎన్ని రోజులున్న వాటికి ఎలాగో డబ్బులొస్తాయి కదా అని మేకప్ లు వేసుకుని కూర్చుంటున్నారు కానీ ఆట మీద కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు. టాస్కులు ఆడట్లేదు..గెలవడానికి ట్రై చెయ్యట్లేదు. ఐతే బిగ్ బాస్ కి బాగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకొస్తే వాళ్ళు ఎం చేస్తారా అని ఆడియన్స్ చూస్తారు అదే కొత్త కొత్త వాళ్ళను తీసుకొస్తే వాళ్ళేం చేస్తే వీళ్ళకెందుకు అని ఎవరూ సరిగా చూడరు అంటూ బిగ్ బాస్ మీద అనాలిసిస్ చేసి చెప్పాడు కౌశల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



