పవర్ స్టార్ కి రియల్ స్టార్ కి ఉన్న తేడా ఏంటి..ఇకనైనా మారతారా!
on Jul 3, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu). జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వంలో ఏఎం రత్నం,దయాకర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సుమారు రెండు నిమిషాల నలభై నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ ఇప్పుడు పవన్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. వీరమల్లు పై అంచనాల్ని కూడా పెంచిందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏఎం రత్నం(Am rathnam)మాట్లాడుతు కళ్యాణ్ గారిపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ యాక్షన్ ఉండేలా ఆయనమీదే చిత్రీకరించిన మొదటి సినిమా వీరమల్లు. ఖుషి సినిమా తర్వాత కళ్యాణ్ తో పాన్ ఇండియా సినిమా చెయ్యాలని అనుకున్నాను. ఇప్పుడు వీరమల్లుతో పాన్ ఇండియా చిత్రం కుదిరింది. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ ని ఏడూ సార్లు చూసారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక చరిత్రని కూడా వీరమల్లు గుర్తు చేస్తుంది. మీరు ఇంతవరకు ఓజి, ఓజి అని అరిచారు. అలాంటిది ట్రైలర్ రిలీజ్ అయ్యాక వీరమల్లు అని అంటారు. అందరు సెలబ్రేట్ చేసుకునే సినిమా వీరమల్లు. ఈ సినిమాతో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ రియల్ స్టార్ గా మారతాడు. అంతలా వీరమల్లు లో అత్యద్భుతంగా నటించాడని ఏఎంరత్నం చెప్పుకొచ్చాడు
జులై 24 న రిలీజ్ కాబోతున్న వీరమల్లులో పవన్ తో నిధి అగర్వాల్(Nidhhi Agerwal)జత కట్టగా బాబీడియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సునీల్, నాజర్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని అందించాడు. .ఏఎం రత్నం, పవన్ కాంబోలో ఇప్పటికే వచ్చిన ఖుషి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరకి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



