మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్

 

ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. కొద్ది నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. మరోవైపు, దాదాపు 9 వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు కొన్ని వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

జూన్ 2024 నాటి గణాంకాల ప్రకారం, మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. తాజా లేఆఫ్‌ల కారణంగా దాదాపు 9,100 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటున టెకీలు గొప్పలకు పోయి వృధాగా ఖర్చు పెట్టొద్దని మిడతల్లా అందుబాటు లో ఉన్నది మొత్తం తినేయడం కాదని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తెలుగోళ్లు సాఫ్ట్వేర్ ఉంటారు. ఇంకా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉంటే బ్లూ కాలర్ పనులకోసం బీహార్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వారు మన రాష్ట్రాని వస్తున్నారు. బతుకు తెరువు కోసం తెలుగు వారు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాల్సిన కాలం ఎంతో దూరంలో లేదని నిపుణులు భావిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu