• Tithi - Mar, 26 2023

    26.03.2023 ఆదివారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం
    తిథి : పంచమి:రా.07.07వరకు
    నక్షత్రం : కృతిక:సా.04.32 వరకు
    వర్జ్యం : లేదు
    దుర్ముహూర్తం : సా 04.30-05.18 వరకు
    రాహుకాలం : సా 04.30-06.00 వరకు

  • Mar, 2023 Important Days

    4. పూర్వాభాద్రకార్తె
    7.హోళీ
    11. సంకష్టహరచతుర్ధి
    20. మాసశివరాత్రి
    22. ఉగాది
    23. రంజాన్ నెల ప్రారంభం
    26. శ్రీ పంచమి, నాగపూజ
    29. గురుమూఢమి ప్రారంభం
    30. శ్రీరామనవమి

Latest Articles

​ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తిని అయినా పాతాళానికి తోసేయగలిగినది కామం. శారీరక కోరికల మోహంలో చిక్కిపోతే ఆ కామం మనిషిని కాల్చివేస్తుంది.. 

 More

ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చింది అని దేవతలలో ప్రతి వారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడయిన పరబ్రహ్మ. అనుకున్నదే తడవుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి 'అగ్నిదేవా! ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా!' అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు అప్పుడు భూతం అడిగింది.

 More

Videos

  • Enduku - Emiti

    ​\పరబ్రహ్మమూ అతి సూక్ష్మము అంటే పరమాణుస్వరూపము. మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరము, స్వప్పావస్థలో సూక్ష్మశరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మశరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినదే కాని కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది.

     More

    ​ధ్యానం గురించి చాలమంది చెబుతారు. అయితే కొందరుంటారు కృత్రిమ జీవితం నుండి, ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుండి సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. వాళ్ళు మొట్టమొదటగా  అడిగే ప్రశ్న “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అని. “భోజనం ఎంత చెయ్యాలి?” అని ఎవ్వరైనా అడిగితే...

     More
  • Vaastu

    ఇంట్లో గొడవలతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..

     More

    ఏయే దిక్కుల్లో ఏమి ఉంటే ఐశ్వర్యం...

     More
  • Aacharaalu

    ​మనిషికి జీవితంలో చాలా విషయాలలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కారణం మనిషి ఆలోచనలు. ఆ ఆలోచనల్లో నిండిపోయిన భావాలు. ఈ కాలం మనిషికి ఆశించడం ఎక్కువ. ఆశించడం అనే గుణం ఎక్కువగా ఉంటే ప్రతి పనిలోనూ తనకు ఒరిగే ప్రయోజనాన్ని, తను కోరుకునే లాభాన్ని గురించే మనసంతా ఉంటుంది తప్ప పని గురించి అంతగా పట్టింపు ఉండదు.... 

     More

    ప్రతి మనిషిలో బాల్యం నుంచీ 'అహంకారం' అనేది అంతర్గతంగా ఉంటుంది. ఊపిరిలో ఊపిరై, రక్తంలో రక్తమై, శరీరం అణువణువునా ఈ అహంకారం నెలకొని ఉంటుంది. దాంతో ఏమీ తెలియకున్నా అన్నీ తనకే తెలుసన్న భావన కలుగుతుంది. తాను సాధించలేనిదేదీ లేదన్న అభిప్రాయం ఉంటుంది. అందరూ తనని అపురూపంగా...

     More

అదితి, దితి, వినత, కద్రువ అనే నలుగురూ కశ్యపుని భార్యలు. అదితి ధరణీదక్షుల కుమార్తె. వినయవిధేయతలతో, ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ వుండేది. కశ్యపుడు సంతోషించి అదితిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. "ముద్దుల మూట కట్టేవాడూ, బుద్ధిమంతుడూ, విద్యావంతుడూ, తేజశ్శాలీ అయిన కొడుకు కావాలి నాకు' అని అడిగింది అదితి. కశ్యపుడు సరేనన్నాడు. ఆ విధంగా అదితి కడుపున ఇంద్రుడు జన్మించాడు. అది చూసి దితి ఓర్వలేకపోయింది. అసూయతో రగిలిపోయి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి 'నాకూ ఇంద్రుడులాంటి కొడుకే కావాలి' అని పట్టుబట్టింది.....

 More

ద్వాపరయుగం చివరలో ఈ భూమిని రాక్షసరాజులు పరిపాలిస్తుండేవారు. వారందరూ అధికారమదంతో ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోకుండా విందులూ విలాసాలలో మునిగితేలుతుండేవారు. నిరంకుశులుగా ప్రవర్తించేవారు. ధర్మదూరులై చరించేవారు. యథా రాజా తథా ప్రజ. ప్రభువు ఉత్తముడయితే... ప్రజలు ఉత్తములవుతారు. ప్రభువు అధర్మపరుడయితే ప్రజలు కూడా అధర్మపరులవుతారు. రాక్షసుల దుష్టపాలనలో ప్రజలు మంచిచెడ్డల విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వశులయ్యారు. ధర్మానికి విరుద్ధంగా నడిచారు. నీతిమాలిన పనులు చేశారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి, భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు.. ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమయ్యేముందు శ్రీకృష్ణుడు అవతరించాడు.

 More

​గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది..

 More

​సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  "దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు" అన్నాడు...

 More

​ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.

 More

​హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??.

 More