ఒక్క సినిమా అన్నా రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంది
on Jul 3, 2025
.webp)
కోర్ట్ మూవీతో హిట్ కొట్టిన కుర్రాడు రోషన్. రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యి ఒక ప్రామిసింగ్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ఒక చిట్ చాట్ షోలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. "ఢీ జూనియర్స్ సీజన్ 2 లో చేసే అవకాశం వచ్చింది. డ్యాన్సింగ్ షోతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఫిలిమ్స్ ప్రకారం "ఈ నగరానికి ఏమయ్యింది" అనేది ఫస్ట్ మూవీ. సలార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాని అన్న అంటే నాకు చాల ఇష్టం. కోర్ట్ లాంటి మూవీని నమ్మి కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా గొప్ప విషయం.
సరిపోదా శనివారం మూవీ టైములో నేను ఆయన్ని చూసాను. నాకు ఆయనతో మాట్లాడేటప్పుడు ఏదో పెద్ద హీరోతో మాట్లాడుతున్న ఫీల్ రాదు సొంత అన్నతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఫలక్నుమా దాస్ మూవీలో విశ్వక్సేన్ అన్నతో చేసాను. ఆయన చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ ఉంటారు. కోర్ట్, టుక్ టుక్ మూవీస్ చేసాం, ఇప్పుడు అల్ ఇండియా ర్యాంకర్స్ మూవీతో ఆడియన్స్ ని అలరిస్తున్నాం. చిరు గారి డాన్స్ అంటే ఇష్టం. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా మగధీర. నాకు ఒక్క సినిమా అన్నా రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంది. హీరో నాని ఒక వైపు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ లో తాను నటిస్తూ అంతకంటే బెటర్ కంటెంట్ ఉన్న మూవీస్ తన దగ్గరకు వస్తే మాత్రం వాటిని నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాంటి మూవీ కోర్ట్. ఆ మూవీ కుర్రాడు రోషన్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



